భారత్ పై OpenAI సీఈవో సామ్ అల్ట్మన్ ప్రశంసలు
- February 16, 2026
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్ పూర్తిస్థాయి గ్లోబల్ లీడర్‌గా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందని చాట్‌జీపీటీ సృష్టికర్త సంస్థ OpenAI సీఈవో Sam Altman ప్రశంసించారు.భారత్ వద్ద AI అభివృద్ధికి అవసరమైన మానవ వనరులు, డేటా, సాంకేతిక మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ డిజిటల్ ఎకోసిస్టమ్‌లో భారత్ కీలక పాత్ర పోషించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.భారత్‌లో చాట్‌జీపీటీని వారానికి 10 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉపయోగిస్తున్నారని, ఇది తమకు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అని ఆయన వెల్లడించారు.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభం కానున్న ‘గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా కథనంలో ఆయన మాట్లాడుతూ, అమెరికా తర్వాత భారత్‌లోనే తమకు అత్యధిక యూజర్లు ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక విద్యార్థి యూజర్లు కూడా భారత్ నుంచే ఉన్నారని, శాస్త్రీయ పరిశోధనల కోసం ఉద్దేశించిన ‘ప్రిజమ్’ అనే ఉచిత టూల్ వినియోగంలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







