దుబాయ్ లో పెయిడ్ పార్కింగ్ అవర్స్ రివైజ్డ్..రెండు గంటలు ఫ్రీ..!!
- February 17, 2026
యూఏఈ : దుబాయ్ RTA రమదాన్ సందర్భంగా పబ్లిక్ పార్కింగ్ సమయాలను ప్రకటించింది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు ఫీజులు వర్తిస్తాయి. ప్రార్థనలు మరియు ఉపవాసాలు విరమించే సమయంలో నివాసితులకు 2 గంటల పాటు ఉచిత పార్కింగ్ లభిస్తుంది. మల్టీ ఫ్లోర్ పార్కింగ్ సౌకర్యాలు 24/7 పనిచేస్తాయని RTA తెలిపింది.
అంతకుముందు, దుబాయ్ టోల్ ఆపరేటర్ సలిక్ కూడా పవిత్ర రమదాన్ మాసం కోసం సవరించిన సమయాలను ప్రకటించారు. అలాగే దుబాయ్ మెట్రో మరియు దుబాయ్ ట్రామ్ సవరించిన సమయాలను RTA వెల్లడించింది.
దుబాయ్ మెట్రో రెడ్ లైన్ మరియు గ్రీన్ లైన్ స్టేషన్లు సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 5 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు, శుక్రవారం ఉదయం 5 గంటల నుండి అర్దరాత్రి 1 గంటల వరకు నడుస్తుంది. ఇక శనివారం ఉదయం 5 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు, ఆదివారం ఉదయం 8 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
దుబాయ్ ట్రామ్ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 6 నుండి మరుసటి రోజు 1 గంట వరకు, ఆదివారం ఉదయం 9 గంటల నుండి మరుసటి రోజు 1 గంట వరకు సర్వీసులు నడుస్తాయని ప్రకటించారు.
ప్రభుత్వ బస్సులు, సముద్ర రవాణా
పబ్లిక్ బస్సుల సమయాల్లో మార్పులను తెలుసుకోవడానికి, ప్రయాణికులు S'hail యాప్ను తనిఖీ చేయాలని సూచించారు. సముద్ర రవాణాలో ప్రయాణించే వినియోగదారులు అప్డేట్ చేసిన షెడ్యూల్ కోసం RTA వెబ్సైట్ను చూడాలని ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







