గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- February 21, 2026
రియాద్: గ్యాస్ లీకేజీలకు సంబంధించి పాటించాల్సిన సేఫ్టీ గైడ్ లైన్స్ ప్రాముఖ్యతను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ హెచ్చరించింది. విద్యుత్ స్విచ్‌లు లేదా ఫైర్ కు కారణమయ్యే ఏదైనా వనరులను ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నివాసితులు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని, గ్యాస్ వాల్వ్ ను సురక్షితంగా మూసివేయాలని మరియు కిటికీలు, తలుపులు నెమ్మదిగా తెరవడం ద్వారా ఆ ప్రదేశాన్ని వెంటిలేట్ చేయాలని డైరెక్టరేట్ సూచించింది. ప్రాణాలను మరియు ఆస్తిని రక్షించడానికి ఇళ్లలో గ్యాస్ లీక్ గుర్తింపు పరికరాలను పెట్టుకోవాలని సిఫార్సు చేసింది.
వివిధ మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జారీ అయ్యే భద్రతా మార్గదర్శకాలు మరియు సూచనలను పాటించాలని సివిల్ డిఫెన్స్ ప్రజలకు పిలుపునిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోరేందుకు మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 కు మరియు రాజ్యంలోని మిగిలిన ప్రాంతాలలో 998 కు కాల్ చేయాలని నివాసితులను కోరింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







