ఘనంగా జరిగిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్–కావ్య రెడ్డి రోకా వేడుక
- March 09, 2026
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రోకా వేడుక కావ్య రెడ్డి నివాసంలో ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, నిర్మాతలు శిరీష్, సాహు గారపాటి, రామ్ ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నాగ వంశీ, కేకే రాధామోహన్, ధీరజ్ మొగిలినేని, హీరోయిన్ సంయుక్త తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి నిశ్చితార్థం, వివాహ తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే ‘కిష్కింధపురి’ తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’ చిత్రాల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!







