గద్దర్ అవార్డ్స్ దక్కించుకున్న విజేతలకు అభినందనలు: ఆర్ నారాయణ మూర్తి
- March 09, 2026
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో ఈటీవి విన్ సత్తా చాటింది. ఈవిన్ నిర్మించిన చిత్రాలు ఏడు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నాయి. బెస్ట్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అనగనగా, సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ -మౌనమే నీ భాష, బెస్ట్ డైరెక్టర్ సాయిలు కంపాటి( రాజు వెడ్స్ రాంబాయి), బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ -సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్) బెస్ట్ మేల్ యాక్టర్ చైతు జొన్నలగడ్డ (రాజు రాంబాయి) ఉత్తమ నేపథ్య గాయకుడు అనురాగ్ కులకర్ణి (రాజు రాంబాయి)కు అవార్డులు దక్కాయి. ఈ సందర్భం ఈవిన్ మేకర్స్ విజేతలతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ...పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ గారికి, అలాగే రాజు వెడ్స్ రాంబాయి చిత్రాన్ని నన్ను చూడమని ఆహ్వానించిన వేణు ఉడుగుల గారికి ధన్యవాదాలు. మట్టి వాసనతో సినిమా తీసి నా చిత్రమని చాటిచెప్పిన డైరెక్టర్ సాయిలకి అభినందనలు. ఈ వేడుక చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఉత్తమ నటులు ఉత్తమ గాయకులు ఉత్తమ దర్శకులు అందరూ కూడా యువత. యువతదే రాజ్యం అని నిరూపించిన సందర్భం ఇది. యువతరానికి నా సెల్యూట్. వీళ్ళని గుర్తించి గౌరవించిన జ్యూరీకి సెల్యూట్. ఈ సంవత్సరం అవార్డులన్నీ నిజంగా అర్హులకే ఇచ్చారనిపించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు నంది అవార్డ్స్ అంటే ఒక గౌరవం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ గారి పేరుతో అవార్డ్స్ పెట్టి సినిమా పరిశ్రమకు అవార్డులు ఇచ్చి ఒక ఉనికిని గుర్తింపుని మళ్లీ తీసుకొచ్చారు. గద్దర్ పేరు పెట్టడం అనేది నిజంగా సెల్యూట్. గద్దర్ గారు ప్రజా కవి తెలంగాణ గడ్డమీద ప్రతి ఇంట్లో ఒక గద్దర్ ఉంటాడు. ఈ లెగసీ కొనసాగాలి.
రామోజీరావు గారు మహానుభావుడు. ఆయన దిక్సూచి, కాలజ్ఞాని. ఆయన చేసిన ప్రతిదీ సక్సెస్. రామోజీరావు గారు చేసిన కృషి అనన్యసామాన్యం. ఆయన ఏది పట్టుకున్న బంగారం. ఆయన నిజమైన మార్గదర్శి అన్నదాత. రామోజీరావు గారు ఏదైతే ఆశించి ఈవిన్ స్థాపించారో ఆ ఉద్దేశం ఈరోజు నెరవేరుతోంది. గొప్ప సినిమాలు రావాలి, కొత్త ప్రతిభ రావాలని ఆయన కన్న కలలని సాకారం చేస్తూ ఈటీవీ విన్ ముందుకు సాగుతోంది. వారికి సెల్యూట్ చేస్తున్నాను. అవార్డులు అందుకున్న కళాకారుడు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా అయితే గద్దర్ అన్న పేరు మీద అవార్డులు ప్రకటించి సినిమా పరిశ్రమని గుర్తించి గౌరవిస్తుందో, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు, రాష్ట్ర ఉనికిని చాటి చెప్పేలా దయచేసి నంది అవార్డులు ప్రకటించాలని సవినయంగా కోరుతున్నాను.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... రామోజీరావు గారు ఉషా కిరణ్ మూవీస్ స్థాపించి సంచలమైన విజయాలు సాధించారు. ఉషా కిరణ్ మూవీస్ విజన్ ని ఈటీవీ విన్ నిలబెట్టింది. రామోజీరావు గారు ఎక్కడున్నా చాలా ఆనందిస్తుంటారు. బడ్జెట్ లు పెరిగిపోయాయి. అసలు చిన్న సినిమాలు ఆగిపోయిన తరుణంలో ఈటీవీ విన్ అద్భుతం చేస్తుంది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన అందరికి కూడా ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చారు. ఈ సంవత్సరం గద్దర్ అవార్డ్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. జ్యూరీ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. చాలా మంచి చిత్రాలకు అవార్డులు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అభినందనలు. విజేతలకు, ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్న అందరికీ అభినందనలు.
ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. మా రచయిత దర్శకులు అందరికీ ధన్యవాదాలు. రామోజీరావు గారి విజన్ తోనే ఇదంతా సాధ్యపడింది.సినిమాలని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఈటీవీ విన్ నుంచి ఇంకా అద్భుతమైన కంటెంట్ రాబోతోంది.
కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ.. ఈరోజు ఒక అద్భుతం. గద్దర్ గారి పేరు మీద అవార్డు మాకు ఆస్కార్ కంటే పెద్ద గౌరవం. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు మాత్రమే కాదు ఎంతోమందికి స్ఫూర్తి. భారతీయులకు నరనరాల్లో భగవద్గీత ఉంటుంది. మా అందరి భగవద్గీత రామోజీరావు గారు. ఆ భగవద్గీతని మాకు నేర్పించిన వ్యక్తి బాపినీడు గారు. కొత్త ప్రతిభకి ఒక రోడ్ వేయమని చెప్పేవారు. ఈరోజు ఆ రోడ్డు ఒక హైవే అయింది. అది ఒక పెద్ద ఓఆర్ఆర్ ఫ్లై ఓవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవార్డులు మాకు ఎంతో బాధ్యతను పెంచాయి.
వేణు ఉడుగులు మాట్లాడుతూ.. ఒక మంచి చిత్రానికి ప్రోత్సాహంగా నాలుగు ప్రతిష్టాత్మక అవార్డులు ఇచ్చిన ప్రభుత్వానికి, జూరీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తొలి దర్శకత్వం చేసే అవకాశం ఈటీవీ కల్పించింది. డాక్యుమెంటరీకి తొలిసారి రచయిత దర్శకుడిగా మారాను. ఇప్పుడు ఇంత కాలానికి నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి కూడా ఈటీవీ సపోర్ట్ చేసింది. సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్యూ సో మచ్.
దర్శకుడు సాయిలు కంపాటి.. మాట్లాడుతూ. . రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డులు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ఈటీవీ విన్ వారికి నా టెక్నీషియన్స్ కి అందరికీ థాంక్యూ. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
అనురాగ్ కులకర్ణి మాట్లాడుతూ. . ఇది నా తొలి అవార్డు. నా జీవితంలో చాలా స్పెషల్. ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది. పాటను అద్భుతంగా కంపోజ్ చేసిన సురేష్ బొబ్బిలి గారికి, దర్శకుడు సాయిలు గారికి, వేణు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ. రెండు కంపోజ్ చేసిన రెండు సినిమాలకి గద్దర్ అన్న అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు
ప్రొడ్యూసర్ రాహుల్ మాట్లాడుతూ.. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ టీవీ వారికి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన నటీనటులకు టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంత మంచి సినిమాలకి అవార్డు రావడం అనేది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.
డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. లిటిల్ హార్ట్స్ కి బెస్ట్ డెబ్యు డైరెక్టర్ గద్దర్ అవార్డ్ రావడం ఒక కలలా ఉంది. జ్యూరీ సభ్యులకి, తెలంగాణ సీఎం గారికి ధన్యవాదాలు. మాకు ఈ వేదిక ఇచ్చిన ఈవిన్ కి థాంక్స్. టీం వర్క్ తోనే ఇది సాధ్యపడింది.
ఆదిత్య హాసన్ మాట్లాడుతూ . లిటిల్ హార్ట్స్ కి గద్దర్ ఫిలిం అవార్డ్ రావడం అనేది ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాము. డైరెక్టర్, హీరో. అందరి ప్రోత్సాహం వల్లే ఈ అవార్డు సాధ్యమైందని భావిస్తున్నాను.
డైరెక్టర్ సన్నీ మాట్లాడుతూ.. అనగనగా సినిమాకి గద్దర్ అవార్డు రావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.నిజాయితీగా తీసిన సినిమా ఆ నిజాయితీనే ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అవార్డును కూడా తీసుకొచ్చింది. సుమంత్ గారికి, టీం అందరికి పేరుపేరునా ధన్యవాదాలు.
నిర్మాత రాకేష్ మాట్లాడుతూ. . ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వారికి థాంక్యూ. ఈ సినిమాని కథ చెప్పగానే ఒప్పుకున్న సుమంత్ గారికి థాంక్యూ. బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా ఈ సినిమాని ఎంచుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
వర ముళ్ళపూడి మాట్లాడుతూ.. మౌనమే నీ భాష అద్భుతమైన ప్రయాణం. యంగ్ టీమ్ తో కలిసి పని చేసాం. ఈటీవీ మాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. రాజీవ్ కనకాల, ప్రమోదుని గారు ఉండడంతో ఫిల్మ్ రీచ్ ఇంకా పెరిగింది. సినిమా చూసినోళ్లు అందరు కూడా ఎమోషనల్ అయ్యారు. కాళీపట్నం రామారావు గారు రాసిన సంకల్పం అనే కథను తీసుకొని ఈ సినిమా చేశాము. మరుగున పడిపోయిన కథలు, ఈ జనరేషన్ కి తెలియాల్సిన కథలు చేసే అవకాశం ఈ టీవీ విన్ వారు నాకు కల్పిస్తున్నారు. ఈటీవీ ఇంకా అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









