‘బైకర్’ రిలీజ్ డేట్ ఫిక్స్
- March 12, 2026
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు తన రూట్ మార్చి ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘బైకర్’ (Biker) ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
వాయిదా పడుతూ వస్తున్న సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. లేటెస్ట్ గా చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 3న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం. ఈ సినిమా కోసం శర్వానంద్ ప్రాణం పెట్టారనే చెప్పాలి. ఒక ప్రొఫెషనల్ బైక్ రైడర్ పాత్రలో కనిపించడం కోసం ఆయన తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. శారీరకంగానే కాకుండా, బైక్ రేసింగ్కు సంబంధించిన మెళకువలను నేర్చుకోవడానికి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు.
ఇటీవల విడుదలైన పోస్టర్లు, టీజర్ గ్లింప్స్ చూస్తుంటే శర్వా లుక్ ఎంతో స్టైలిష్గా, మునుపెన్నడూ చూడని విధంగా ఉంది. ‘ట్యాక్సీ వాలా’ ఫేమ్ మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. శర్వా, మాళవికల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు మరో ఆకర్షణ కానుంది. సీనియర్ హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర సినిమా మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







