గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- March 13, 2026
జెమినీ ఏఐతో కలిసి గూగుల్ తన మ్యాప్ యాప్‌లో తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ ‘ఆస్క్ మాప్స్’. ఇది కేవలం ఒక సెర్చ్ బార్ లా కాకుండా, చాట్‌బాట్‌లా పనిచేస్తుంది. దీనితో మీరు నేరుగా మాట్లాడవచ్చు.మ్యాప్స్‌కు సంబంధించి మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు అది సమాధానం చెబుతోంది. ఇందుకోసం మీరు మ్యాప్స్‌లో ఉన్న ‘ఆస్క్ మాప్స్’ బటన్ మీ నొక్కి, మీకు కావలసిన సమాచారం గురించి అడగవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ప్రదేశాలు, 50 కోట్ల మంది కంట్రిబ్యూటర్ల సమాచారాన్ని ఉపయోగించి జెమినీ ఏఐ మీకు సరైన సమాధానాలను అందిస్తుంది. ఉదాహరణకు మీరు మూడు గంటల పాటు ప్రయాణించేలా ఉంటే మధ్యలో లంచ్ చేయడానికి లేదా కాఫీ తాగడానికి వీలుగా ఉన్న ఫ్యామిలీ హైకింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి? అని అడిగితే అది మీకు బెస్ట్ స్టేస్‌లను సజెస్ట్ చేస్తుంది.
ఇమ్మర్సివ్ నావిగేషన్: ఆస్క్ మ్యాప్స్‌తో పాటు, గూగుల్ ఇమ్మర్సివ్ నావిగేషన్‌ను అనే ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది, గత పదేళ్లలో డ్రైవింగ్, రూట్ గైడెన్స్‌లో ఇదే అతిపెద్ద మార్పు అని గూగుల్ పేర్కొంది. ఈ ఫీచర్‌లో మీరు జెమిని మోడల్స్ సపోర్ట్‌తో స్ట్రీట్ వ్యూ, ఏరియల్ ఫోటోలను కలిపి, రోడ్లు, భవనాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, ల్యాండ్‌మార్క్‌లను రియలిస్టిక్‌గా 3D రూపంలో చూపవచ్చు.ఈ ఫీచర్ వల్ల క్లిష్టమైన టర్నింగ్ వద్ద డ్రైవర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఏ లేన్‌లో వెళ్లాలో స్పష్టంగా అర్థమవుతుంది.
ఇమ్మర్సివ్ నావిగేషన్ ఫీచర్ అనేది ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం వాకింగ్, సైక్లింగ్ మార్గాల కోసం యాజ్ అవుతుంది. దీన్ని త్వరలో ఆండ్రాయిడ్ ఆటో, కార్‌ప్లే వంటి వాహన ప్లాట్‌ఫామ్‌లలోకి తీసుకురానున్నట్టు గూగుల్ పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







