అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- March 17, 2026
దోహా: సబా అల్ అహ్మద్ కారిడార్‌లోని అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ వద్ద తాత్కాలిక రహదారి మూసివేతను ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. దీంతో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మెసాయిద్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ ప్రభావితం అవుతుందని పేర్కొంది.
అష్ఘల్ ప్రకారం, అవసరమైన నిర్వహణ పనుల కోసం ఈ మూసివేత మార్చి 20 మరియు 21 తేదీలలో ఉదయం 2 గంటల నుండి 10 గంటల వరకు, మొత్తం ఎనిమిది గంటల పాటు కొనసాగుతుంది.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సమన్వయంతో ఈ తాత్కాలిక మూసివేతను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూసివేత సమయంలో, హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సబా అల్ అహ్మద్ కారిడార్ మీదుగా ఉత్తరం వైపు ప్రయాణించే వాహనదారులు, సమీపంలోని ఇంటర్చేంజ్ లను మరియు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు సూచించారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ మార్గాలతోకూడిన మ్యాప్ ను విడుదల చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







