యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో ‘అనిరుధ్’ ఒప్పందం
- March 17, 2026
వరుస సినిమాలతో దక్షిణాది సినీ సంగీతాన్ని ఊపేస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రపంచంలో తన మార్క్ చూపించడానికి సిద్ధమయ్యారు. గ్లోబల్ మ్యూజిక్ దిగ్గజం యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో అనిరుధ్ కుదుర్చుకున్న ఈ ఒప్పందం భారతీయ సంగీత రంగంలో ఒక కీలక మలుపుగా మారనుంది.
దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఉన్న మ్యూజిక్ కల్చర్‌ను గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లాలని ఆ సంస్థ గట్టిగా భావిస్తోంది. అందుకే ఈ ప్రాంతంలో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న అనిరుధ్ తో జట్టుకట్టింది. తన అల్బుకర్క్యూ రికార్డ్స్ ద్వారా ఇండియన్ ఇండిపెండెంట్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలనేది తన లక్ష్యమని, దానికి పాప్, హిప్-హాప్ మ్యూజిక్‌లో ఎంతో అనుభవం ఉన్న యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా సరైన భాగస్వామి అని అనిరుధ్ చెప్తున్నాడు. కొత్త తరం మ్యూజిక్ ఆర్టిస్టులను ప్రోత్సహించి వారి టాలెంట్‌ను ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కి చేర్చడానికి, అలాగే సౌత్ ఇండియన్ పాప్, హిప్-హాప్ రేంజ్‌ను పెంచడానికి ఈ డీల్ బాగా ఉపయోగపడుతుంది.
భారతీయ సంగీత భవిష్యత్తు అనిరుధ్ లాంటి ప్రతిభావంతుల చేతుల్లోనే ఉందని యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా చైర్మన్ & సీఈఓ దేవరాజ్ సన్యాల్ ప్రశంసించారు. డిఫరెంట్ స్టైల్‌తో మ్యూజిక్ క్రియేట్ చేసే అనిరుధ్ కొత్త ప్రయాణానికి సపోర్ట్ చేయడం తమకు గర్వకారణం అన్నారు. అలాగే, యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సనుజీత్ భుజబల్ మాట్లాడుతూ.. సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ ఇవ్వడమే కాకుండా, తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్‌బేస్‌ను అనిరుధ్ క్రియేట్ చేసుకున్నాడని చెప్పారు. అల్బుకర్క్యూ రికార్డ్స్ ద్వారా ఇండియన్ పాప్ (I-Pop), హిప్-హాప్ మ్యూజిక్‌లో రాబోయే రోజుల్లో అనిరుధ్ సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమని వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఇటు వరస సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద కూడా తనదైన పట్టు చూపిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







