తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- March 18, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేటి నుంచి రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ అకాల వర్షాలు పడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు ఉండగా, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







