ఓటీటీని షేక్ చేస్తున్న ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం
- March 21, 2026
ఓటీటీని షేక్ చేస్తున్న ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం
నటి ప్రియాంక అరుల్ మోహన్ తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కోలీవుడ్‌పై దృష్టి సారించి అక్కడ స్టార్ హీరోల సరసన వరుస విజయాలను అందుకుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాతో తెలుగులోకి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చి, భారీ విజయాన్ని తన చేసుకుంది.
ఈ క్రమంలో ఆమె తాజాగా నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం మేడ్ ఇన్ కొరియా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇది ఆమె కెరీర్‌లో మొదటి మహిళా ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం కావడం విశేషం. ఈ సినిమా నేరుగా Netflix ఓటీటీలో విడుదలైంది. 2026 మార్చి 12 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం తక్కువ అంచనాలతో వచ్చినప్పటికీ, భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి కొరియా వెళ్లాలని కలలు కనే ఓ యువతి కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రేమలో మోసపోయిన తర్వాత కూడా ఆమె తన జీవితాన్ని ఎలా మలుచుకుంది? విదేశీ నేలపై తనను తాను ఎలా నిలబెట్టుకుంది? అనే భావోద్వేగ అంశాలతో కథ సాగుతుంది. ఇక ఓటీటీలో పరిస్థితులు కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చాయి. పెద్ద సినిమాల విడుదలలు లేకపోవడంతో.. ఈ చిన్న సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ చిత్రం Netflixలో ఇండియాలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.సినిమా టికెట్స్ ఆన్‌లైన్
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







