'డెకాయిట్' నుంచి జైన్ మేరీ ఖాన్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్
- March 21, 2026
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె జైన్ మేరీ ఖాన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది.
జైన్ మారీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఖాకీ యూనిఫామ్‌లో భుజాలపై స్టార్ ఎపాలెట్స్, హోల్స్టర్ బెల్ట్‌తో తుపాకీ పట్టుకుని ముందుకు గురిపెట్టిన ఆమె లుక్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ పోస్టర్‌లో జైన్ పాత్ర యొక్క ఇంటెన్సిటీ స్పష్టంగా కనిపిస్తోంది. వెనుక వైపు ఇతర పోలీస్ అధికారులు ఉండటం ఈ సన్నివేశానికి మరింత బలం చేకూర్చింది.
ఈ పోస్టర్‌ను చూసిన ఆమిర్ ఖాన్ వెంటనే స్పందించి అభినందనలు తెలుపుతూ మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హిందీ ప్రేక్షకుల్లో సినిమాకు మరింత హైప్‌ను తెచ్చింది.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, అలాగే మొదటి సాంగ్ ‘రుబారు’.. అన్నీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతూ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ మూవీని ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా
తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు.
సుప్రియా యార్లగడ్డ నిర్మాణంలో, సునీల్ నారంగ్ సహనిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘డెకాయిట్'’కి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సినిమాటోగ్రాఫర్ దనుష్ భాస్కర్ రగ్డ్ విజువల్స్‌ను అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందిస్తున్నారు. గ్యాని అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎమోషన్ మరింతగా పెంచనుంది.
ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతున్న ‘డెకాయిట్'’ లవ్, హార్ట్‌బ్రేక్, అద్భుతమైన యాక్షన్ తో ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







