పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- March 22, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నఖల్ (Nakhal) ప్రాంతంలో వాడి (వాగు) ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక పిల్లిని రక్షించడానికి ఒక వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టడం చర్యనీయంశంగా మారింది.
"అల్-మసరత్" (Al-Masarrat) అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో పలు గవర్నరేట్లలో వేర్వేరు తీవ్రతలతో వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పాటు వాడి ప్రవాహాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రాణాలను మరియు ఆస్తులను రక్షించుకునే దృష్ట్యా, ప్రజలు వాడి ప్రవాహాలను దాటవద్దని మరియు భద్రతా చర్యలను కచ్చితంగా పాటించాలని రాయల్ ఒమన్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
వాతావరణ తెలిపిన వివరాల ప్రకారం, నార్త్ అల్ షర్కియా, సౌత్ అల్ షర్కియా, అల్ వుస్తా, అల్ దఖిలియా, అల్ ధాహిరా, సౌత్ అల్ బతినా మరియు మస్కట్ గవర్నరేట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో ఈ వాతావరణ ప్రభావం నార్త్ అల్ షర్కియా, సౌత్ అల్ షర్కియా, అల్ వుస్తా, అల్ దఖిలియా, అల్ ధాహిరా, సౌత్ అల్ బతినా మరియు మస్కట్ గవర్నరేట్ల వరకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







