'బైకర్' హై-వోల్టేజ్ రైడ్‌ ట్రైలర్ లాంచ్

- March 22, 2026 , by Maagulf
\'బైకర్\' హై-వోల్టేజ్ రైడ్‌ ట్రైలర్ లాంచ్

చార్మింగ్ స్టార్ శర్వా, భిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా 'బైకర్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. డాల్బీ సినిమా, EPIQ, 4DX,  PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల కానుంది. దీంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.  ప్స్‌లు, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ను సృష్టించాయు. ఈ రోజు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ఇండియన్  రేసర్లు ప్రపంచ స్థాయి ప్రతిభావంతులతో సమానంగా నిలబడగలరా అని ఒక ఫారిన్ స్పోర్ట్స్ యాంకర్ ప్రశ్నించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. క్రమశిక్షణ వున్నప్పటికీ, పరిష్కారం కాని సంఘర్షణలు ఉన్న రైడర్‌గా విక్కీ పరిచయం అవుతాడు. అతని పోరాటాలు ట్రాక్‌పైనే కాదు, అతన్ని పెంచి, శిక్షణ ఇచ్చిన తండ్రితో. వారి మధ్య ఉన్న బాండింగ్ కథకు అద్భుతమైన ఎమోషన్ ని యాడ్ చేస్తోంది.

శర్వ ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. రేసర్ గా ఆయన ప్రజెన్స్ అదిరిపోయింది. ఈ పాత్ర కోసం ఆయన ఫిజికల్ ట్రాస్ ఫర్మేషన్ మెస్మరైజ్ చేస్తోంది. నను తాను నిరూపించుకోవడానికి తపించే కొడుకు ఎమోషన్ ని అద్భుతంగా పండించారు. శర్వా ఇంటెన్స్ యాక్టింగ్ నెస్ట్ లెవల్ లో ఉంది.  

రాజశేఖర్ రాజీపడని తండ్రి-గురువుగా పాత్రకు బలాన్ని చేకూర్చారు. ఆయన రీఎంట్రీలో ఇంతటి ఇంటెన్స్ పాత్రలో అతన్ని చూడటం కొత్తగా వుంది. అలజడితో కూడిన విక్కీ ప్రపంచంలో మాళవిక నాయర్ ప్రశాంతతను అందిస్తుంది. అతుల్ కులకర్ణి  విలన్ ఛాయలున్న పాత్రను పోషించారు. వీరందరూ కలిసి అత్యంత ఉత్కంఠభరితంగా అనిపించే ఒక డ్రామాను అందించారు.

విజువల్ గా ట్రైలర్ అబ్బురపరిచింది. జె యువరాజ్ కెమెరా వర్క్ మోటోక్రాస్‌లోని ప్రమాదం, వేగాన్ని అత్యంత అద్భుతంగా చిత్రీకరించగా, గిబ్రాన్ అందించిన ఉత్కంఠభరితమైన సంగీతం ప్రతి రేసును ఒళ్లు గగుర్పొడిచే అనుభవంగా మారుస్తుంది. యూవీ క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లోనూ అద్భుతంగా కనిపిస్తూ గొప్ప థియేటర్ అనుభూతినిచ్చేలా వున్నాయి.
 
'బైకర్' ట్రైలర్ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలకు భిన్నంగా ఒక హై-వోల్టేజ్ రైడ్‌ను అందిస్తుందని ప్రామిస్  చేస్తోంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి  తీసుకెళ్ళింది.

4DXలో ఈ ట్రైలర్‌ను వీక్షించిన మీడియా ప్రతినిధులు, అందులోని వరల్డ్ బిల్డింగ్,జువల్స్, టాప్ క్లాస్ సౌండ్ డిజైన్‌ చూసి మెస్మరైజ్ అయ్యారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో శర్వా మాట్లాడుతూ..  మీడియా మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారం. మొన్న ప్రభాస్ అన్న చెప్పాడు.. సీనియర్స్ తర్వాతే మేము.  సీనియర్స్ ముందు నడుస్తుంటారు. వారి వెనక మేము నడుస్తాం. రాజశేఖర్ గారు ఈ సినిమా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. దిల్ రాజు గారు చెప్పినట్లు నిర్మాతలు దగ్గరుండి కథలు రాయించి సినిమాలు చేస్తే ఖచ్చితంగా మంచి విజయవంతమైన చిత్రాలు వస్తాయి. నాకు బాగా గుర్తు శతమానం భవతి సినిమా సమయంలో దిల్ రాజు గారు దగ్గరుండి పాటలు రాయించుకునేవారు. అలాంటి డెడికేషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ పరిశ్రమకు కావాలి. వంశి అన్న కూడా తనకు కావలసిన సాంగ్స్ నీ దగ్గరుండి రాయించుకుంటారు. బైకర్ సినిమా  గురించి ఒకటే మాట చెప్తాను.. మొన్న చెప్పి హిట్టు కొట్టాను.(నారీనారీ నడుమమురారి) ఇప్పుడు మళ్లీ చెప్తున్నాను. ఈసారి బైకర్ తో బంపర్ బ్లాక్ బాస్టర్ కొడుతున్నాను. ఇండియా మొత్తం మాట్లాడుకునే గొప్ప సినిమా తీశాం. ఏప్రిల్ 3న థియేటర్లో కలుద్దాం. సినిమా గురించి ఇంకా మాట్లాడుకుందాం. అందరికీ థాంక్యు.

డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ..  అందరికి నమస్కారం. నేను మంచి క్యారెక్టర్స్ చేయాలని చాలా కథలు విన్నాను. కానీ ఏది నచ్చలేదు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత డైరెక్టర్ అభిలాష్ గారు ఈ కథ చెప్పారు. ఇందులో క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. శర్వా గారి సినిమాలో చేస్తున్నామంటే సెకండ్ హీరోనే కదా అనే ఒక ఆలోచన ఉండేది. కానీ మా పిల్లలు ఇప్పుడు అన్నీ మారిపోయాని చెప్పారు. ఇప్పుడు దిల్ రాజు గారు అదే మాట్లాడటం వింటే చాలా ఆనందంగా అనిపించింది. నేను ఇప్పుడు  మంచి పాత్రలు చేయడానికి అడ్జస్ట్ అయిపోయాను. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మంచి పాత్రలు ఉంటే నన్ను పెట్టుకోండి. నాకోసం మంచి క్యారెక్టర్స్ తీసుకుని రమ్మని కోరుతున్నాను. శర్వా గారు వెరీ నైస్ పర్సన్. యు వి క్రియేషన్స్ ట్రీట్మెంట్ అద్భుతం నేను హీరోలాగే వెళ్ళాను. శర్వా గారు వంశి గారు అందరు కూడా నన్ను ఒక హీరోలాగే చూసుకున్నారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఏప్రిల్ 3 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..  అందరికి నమస్కారం. వంశీ వాసు ఆర్య సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా పరిపరిచమయ్యారు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గా సక్సెస్ఫుల్ గా జర్నీ చేస్తున్నారు. మంచి కథను తయారు చేసుకుని వాళ్లు చేసిన సినిమాలు విజయవంతంగా ఆడాయి. శర్వా తో చేసిన రన్ రాజా రన్ ఎక్స్ప్రెస్ రాజా మహానుభావుడు అన్నీ కూడా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. ఎక్స్ప్రెస్ రాజా తర్వాత వంశి బైకర్ సినిమా చూడమని చెప్పారు. సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. ముందుగా డైరెక్టర్ అభిలాష్ కి క్రెడిట్ ఇవ్వాలి. తను అనుకున్నది స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడు. విజువల్స్ రేసింగ్ సీన్లు అద్భుతంగా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఆడియన్స్ థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తారు. ఫాదర్ సన్ ఎమోషన్ అద్భుతంగా ఉంది. శర్వా పెర్ఫార్మెన్స్ సూపర్. తన మేకోవర్ చూస్తే షాకింగ్ గా అనిపించింది. అలాగే ఇందులో శర్వా మాళవిక వచ్చే కెమిస్ట్రీ కూడా చాలా సూపర్బ్ గా ఉంది. రాజశేఖర్ గారిని మనం అన్ని రకాల పాత్రల్లో చూసాం. కానీ ఈ సినిమాలో ఆయన ఒక కోచ్ గా ఫాదర్ గా చేసిన పర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. వంశి ఈ సినిమాతో ఇండస్ట్రీకి చాలా మంచి ఫిల్మ్ ఇస్తున్నారు. ఏప్రిల్ 3న ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ రెస్పాన్స్ తో ఆడియన్స్ అలరించబోతోంది.

డైరెక్టర్ అభిలాష్ మాట్లాడుతూ..  అందరికి నమస్కారం.  ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సౌండ్ డిజైన్ గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడారు. మేము ఆశించిన స్థాయిలోఆడియన్స్ కి రీచ్ అయింది. సినిమా రెండు టైమ్ లైన్స్ లో జరుగుతుంది. 90,  2000. ఈ రెండు టైమ్ లైన్స్ ని కూడా చాలా అద్భుతంగా రీ క్రియేట్ చేసాం. మేము వాడిన బైక్స్ కూడా చాలా ప్రామాణికంగా ఉంటాయి. ప్రతి రేస్ సీన్ వెనక ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. ఇందులో అద్భుతమైన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. అది ఆడియోస్ అందరికి కనెక్ట్ అవుతుంది. సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది అంటే శర్వానంద్ గారు కారణం. క్యారెక్టర్ కోసం చాలాఅద్భుతంగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. రాజశేఖర్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందం ఇచ్చింది. ఈ సినిమా కోసం ఎన్ని కాల్ సీట్స్ అయినా ఇచ్చారు. మాళవిక గ్రేట్ పర్ఫార్మర్.  దిల్ రాజు గారు సినిమా చూసి చాలా అద్భుతంగా చేసావని చెప్పారు. అప్పుడు నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆనందం కలిగింది.

బన్నీ వాసు మాట్లాడుతూ..  అందరికీ నమస్కారం. యు.వి క్రియేషన్స్ అంటే నాకు సొంత సంస్థ లాంటిది. వంశీ తో నాకు దాదాపు పాతికేళ్ల జర్నీ. బైకర్ సినిమాని నాకు కావాల్సిన ఒక ఇద్దరు చూశారు. సెకండ్ హాఫ్ అదిరిపోయింది అని చెప్పారు. యూత్ కి ఈ సినిమా టెక్నికల్గా చాలా నచ్చుతుంది. ఈ సినిమాలో సౌండ్ డిజైనింగ్ అదిరిపోయిందని ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు.  ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా వచ్చి చాలా రోజులైయింది. కచ్చితంగా ఈ సినిమా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అభిలాష్ కి యు.వి క్రియేషన్స్ దొరకడం తన అదృష్టం . శర్వా గారు చాలా నైస్ పర్సన్. తన సినిమాలో కంటెంట్ ఏముంటుందో అదే ప్రజెంట్ చేస్తారు. ఓవర్ గా హైప్ చేయరు. తను ఎంత జెన్యూన్ గా ఉంటారో తన సినిమా పబ్లిసిటీ కూడా అంతే జెన్యూన్ గా ఉంటుంది. ఈ సినిమా అదిరిపోతుంది.  

మాళవిక నాయర్ మాట్లాడుతూ..  అందరికి నమస్కారం.  ట్రైలర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. అభిలాష్ గారు ఈ సినిమాలో నన్ను శర్వానంద్ గారిని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. ట్రైలర్ లో చూసింది  కొంచెమే. సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. రాజశేఖర్ గారితో కలిస పనిచేయడం చాలా ఆనందం ఇచ్చింది. సినిమా సక్సెస్ ఈవెంట్లో కలుద్దాం.

మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్  మాట్లాడుతూ .. వంశీ గారికి థాంక్ యూ. శర్వా గారు అద్భుతమైన పర్ఫార్మన్స్ ఇచ్చారు. రన్ రాజా రన్ కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరు కూడా బెస్ట్ ఇచ్చారు.   తప్పకుండా ఈ సినిమా ఇండియన్ ఫిలిమ్స్ లో ఒక మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది.

డిఓపి జే యువరాజ్ మాట్లాడుతూ.. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలో ఇంకా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. శర్వా గారి ట్రాన్స్ఫర్మేషన్ మామూలుగా లేదు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

నటీనటులు: ఛార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
సమర్పణ: విక్రమ్
బ్యానర్: UV క్రియేషన్స్
సంగీతం: జిబ్రాన్
DOP: J యువరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్
ఎడిటర్: అనిల్ కుమార్ P
ఆర్ట్ డైరెక్టర్: A పనీర్ సెల్వం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: First Show

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com