'వీరభద్రుడు'-మే 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
- April 04, 2026
సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ 'కరుప్పు' కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలని సృష్టించింది.
తాజాగా ఈ చిత్రానికి తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ పెట్టారు. సూర్య పవర్ఫుల్ అవతార్‌లో కనిపించిన టైటిల్ పోస్టర్ అదిరిపోయింది.
ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీ.
2026 మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తారాగణం: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి, శ్శివాడ, సుప్రీత్ రెడ్డి
రచన & దర్శకత్వం: RJ బాలాజీ
సినిమాటోగ్రఫీ - జికె విష్ణు
సంగీతం - సాయి అభ్యంకర్
యాక్షన్ అన్బరివ్ - విక్రమ్ మోర్
ఎడిటర్ - ఆర్.కళైవానన్
ప్రొడక్షన్ డిజైన్ - అరుణ్ వెంజారామూడు
నిర్మాతలు: ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు
పీఆర్వో - వంశీ-శేఖర్
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







