‘లెనిన్’ రిలీజ్ డేట్ ఫిక్స్
- April 09, 2026
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. నేడు అఖిల్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ సినిమాను జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అఖిల్ కెరీర్లో ఈ చిత్రం అత్యంత కీలకం కావడంతో, దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కొత్త రిలీజ్ డేట్‌తో అక్కినేని ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.
నిజానికి ‘లెనిన్’ చిత్రాన్ని మే 1వ తేదీనే విడుదల చేయాలని మేకర్స్ మొదట ప్లాన్ చేశారు. అయితే, అదే సమయంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాష్ ఏర్పడే అవకాశం కనిపించింది. రెండు భారీ చిత్రాలు ఒకేసారి తలపడితే వసూళ్లపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో, చిత్ర బృందం వెనక్కి తగ్గి జూన్ 26ను ఎంచుకుంది. మరోవైపు రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







