కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!
- April 10, 2026
బర్కాః ఒమన్ లో సముద్ర జీవావరణ వ్యవస్థలను పరిరక్షించడానికి వీలుగా దైమానియత్ ఐస్ లాండ్ నేచర్ రిజర్వ్‌లో కోరల్ రిఫ్ కల్టివేషన్ ప్రాజెక్టును ఎన్విరాన్ మెంట్ అథారిటీ ప్రారంభించింది. 600 నుండి 1,000 రిఫ్ ముక్కలను నాటడం ద్వారా, ఈ రిజర్వ్‌లోని అరుదైన పగడపు దిబ్బలను పునరుద్ధరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని అథారిటీ తెలిపింది. ఇది సముద్ర జీవులకు, ముఖ్యంగా గ్రూపర్ (హమౌర్) వంటి అధిక ఆర్థిక విలువ కలిగిన జాతులకు సహజ ఆవాసాలను అందించడంలో దోహదపడుతుందన్నారు.
అలాగే, ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా జీవ మరియు పర్యావరణ సర్వేలను నిర్వహించనున్నారు. సాగు చేసిన పగడపు దిబ్బల పెరుగుదల రేట్లను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం విద్యా భాగస్వామిగా, ఒమన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఒమన్ ఎల్‌ఎన్‌జి) కంపెనీ మద్దతుతో అమలు చేస్తున్నట్లు అథారిటీ పేర్కొంది. ఇలాంటి ప్రాజెక్టులు సముద్ర పర్యావరణ పర్యాటకానికి ఒమన్ ను ఒక ప్రముఖ గమ్యస్థానంగా మారుస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







