బైకర్ తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని చెప్పాము: హీరో శర్వా

- April 10, 2026 , by Maagulf
బైకర్ తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని చెప్పాము: హీరో  శర్వా

చార్మింగ్ స్టార్ శర్వా లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రిమియర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకులు, విమర్శకులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.

థాంక్యూ మీట్‌లో హీరో శర్వా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నేను హిట్ కొడితే మీరు హిట్ కొట్టినట్టు ఫీల్ అవుతారు. మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. నేను మంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తాననే నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కోల్పోలేదు. మొదటి నుంచే బైకర్ తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని చెబుతున్నాను. ఆ మాట తప్పలేదు. అలాంటి మంచి ఫ్యామిలీ సినిమాను తీశాం. సినిమా అద్భుతంగా మౌత్ టాక్‌తో వెళ్తోంది. దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్, యూత్. అభిలాష్ మంచి ఫాదర్ అండ్ సన్ స్టోరీ చెప్పాడు. ఇది చాలా ఎమోషనల్ మూవీ. నిజ జీవితంలో తండ్రి, కొడుకులు అలానే ఉంటారు. రాజశేఖర్ గారు మాకు ఎప్పుడూ హీరోనే. ఆయన ఈ సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా టీమ్ అందరికీ థాంక్యూ. మా మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. అలాగే మా డీవోపీ, ప్రొడక్షన్ డిజైన్ టీమ్ అందరూ అద్భుతంగా చేశారు. రేసింగ్ సీన్స్ ఇంత అద్భుతంగా వచ్చాయంటే, అది మొత్తం టీమ్ ఎఫర్ట్. టెక్నికల్‌గా సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రశంసలు రావడానికి మా టీమ్ వర్క్ కారణం. ఇది నా బెస్ట్. ఇంత అద్భుతమైన సినిమాను అందించిన యువీ క్రియేషన్స్‌కు ధన్యవాదాలు. మేము చేసిన నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్లే. నా వెనుక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను. ఈ ఏడాది నాకు రెండు హిట్లు ఇచ్చాడు. ప్రేక్షకులకు ధన్యవాదాలు. లవ్ యూ ఆల్.

డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి, నా క్యారెక్టర్‌కు మంచి పేరు రావడానికి కారణం అభిలాష్ రెడ్డి గారు. మొత్తం టీమ్ కు  మంచి పేరు తీసుకొచ్చారు. శర్వా గారికి  థాంక్స్ చెబుతున్నాను. ఆయన హీరోగా చేస్తున్న సినిమాలో నేను ఇంత మంచి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే శర్వా గారు, మాళవిక ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చాలా అద్భుతంగా నటించారు. సినిమా ఇంకా చూడని వాళ్లు థియేటర్‌కి వెళ్లి చూడండి. పేరెంట్స్‌ను కూడా తీసుకెళ్లండి. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. అందరికీ థాంక్యూ సో మచ్.

డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ప్రీమియర్స్ నుంచే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను అభినందించారు. చూసిన వాళ్లందరూ కూడా ఇంత అద్భుతంగా ఎలా తీశారని అడుగుతున్నారు. టెక్నికల్‌గా సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో రేసింగ్‌తో పాటు ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతున్నారు. ఫాదర్ అండ్ సన్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు. చిన్న చిన్న పిల్లలు కూడా సినిమాను చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇది చాలా లాంగ్ రన్ ఉండే సినిమా. ఈ సమ్మర్ అంతా బైకర్ దే.  మా సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నన్ను నమ్మిన శర్వా గారికి థాంక్యూ. రాజశేఖర్ గారు, శర్వా గారి మధ్య ఎమోషన్ అద్భుతంగా పండింది. ఈ క్యారెక్టర్ చేసినందుకు రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు. థియేటర్ కి వెళ్లి చూడండి.తప్పకుండా అందరికీ సినిమా నచ్చుతుంది.”

హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈ సినిమాకి ఆడియన్స్, మీడియా ఇచ్చిన సపోర్ట్, ప్రేమ మర్చిపోలేం. సినిమాను అందరూ ఇష్టపడుతున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేం. అదే పాయింట్‌తో ఈ సినిమాను మీ ముందుకు తీసుకొచ్చాం. ఎమోషన్‌కు ఆడియన్స్ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాను చూసి మరో పదిమందికి చెప్పండి. అందరికీ థాంక్యూ సో మచ్.”

యాక్టర్ నిరూప్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈ సినిమాకి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్యూ. తెలుగులో ఇది నా ఫస్ట్ సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్నిస్తోంది. ఈ ఈవెంట్ లో మూవీ టీం పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com