డెకాయిట్‌ నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్: హీరో అడివి శేష్

- April 12, 2026 , by Maagulf
డెకాయిట్‌ నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్: హీరో అడివి శేష్

హిట్ మిషన్ అడివి శేష్  లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ 'డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో  విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, స్వప్నదత్, నందిని రెడ్డి పాల్గొన్నారు.  

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..అందరికీ హాయ్. సినిమా తీయడం రాయడం అంత ఈజీ కాదు. అలాగే రిలీజ్ కూడా. ఒక సినిమాకి రెండు మూడేళ్లు పడుతుంది. ఆ సమయంలో అసలు ఎందుకు చేస్తున్నామనే ఆలోచనలు కూడా వస్తాయి. మనందరి ప్రయత్నం కూడా ఒక మంచి సినిమా తీయాలని. ఈ జర్నీలో వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ లు వింటుంటే చాలా ఫ్యాషన్ తో ఈ సినిమా తీశారు అనిపిస్తుంది. ప్రేమతోనే సినిమా చేస్తాం. ఆ ప్రేమతోనే సినిమాకి ప్రాణం వస్తుంది. డెకాయిట్ చూసి ఆడియన్స్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. సుప్రియ గారు నా సీనియర్. వారు ఇంత మంచి సినిమాని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. శేష్ సినిమా వస్తుంటే చాలా నేర్చుకోవచ్చు. రైటింగ్ ఎడిటింగ్ స్క్రీన్ ప్లే అని చాలా కొత్తగా ఉంటాయి. సినిమాని హిట్ అయ్యేవరకు తీస్తారు. అది ఆయన పాషన్. టీమ్ అందరికీ బిగ్ కంగ్రాజులేషన్స్. డెకాయిట్ సమ్మర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా చూసినప్పుడు మనసు బరువు ఎక్కుతుంది. ఇలాంటి ఫీలింగ్ చాలా అరుదుగా వస్తుంది. సినిమాని చూసినప్పుడు ఒక ఎక్సైట్ మెంట్ కలగాలి. అలాంటి ఎక్సైట్మెంట్ కలిగించిన సినిమా ఇది. మృణాల్ అమెజింగ్. తను స్మిత పాటిల్, మధుబాల లాంటి గొప్ప క్యారెక్టర్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను చాలా ఎంజాయ్ చేశాను. మా టీం అందరూ సినిమాకి వెళ్తారు. అందరికీ థాంక్యూ సో మచ్.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ..గతవారం నుంచి నేను చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను. 2013లో 'కిస్' అనే ఒక సినిమా చేశాను. సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల సరిగ్గా రాలేదు. అప్పటినుంచి ఒకటి డిసైడ్ అయ్యాను. ఎప్పటికైనా సరే పట్టుదలతో గట్టిగా పట్టుకొని సినిమా చేయాలి, మనసుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పటినుంచి జర్నీ అలానే సాగింది. మెల్లమెల్లగా క్రెడిబిలిటీ వచ్చింది. నా బిగ్గెస్ట్ ఓపెనర్ ఇది. నేను ఇంట్లో పెద్ద కొడుకుని. పెద్ద కొడుకు మీద అన్ని బాధ్యతలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. నా మైండ్ లో ఆడియన్స్ నా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేయాలి నేను సెట్ లో అన్ని పనులు చేస్తాను. దీనికి కారణం మన ఫ్యామిలీని చూసుకోవాలి. ఒకటి నమ్ముకున్న తర్వాత దానికోసం కష్టపడి పనిచేయడం నాకు తెలుసు.  ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ చెప్పాలనిపించింది. అది కూడా ఒక జెన్యూన్ గా కొత్తగా చెప్పాలనిపించింది. జీవితంలో ఉన్న చిన్న విషయాలతో  ఈ కథను అల్లడం జరిగింది. మనకు జీవితంలో చిన్న చిన్న విషయాలే గుర్తుంటాయి. ఆ ప్రేమ కథలో కూడా అలా గుర్తుండిపోయే సన్నివేశాలు ఉన్నాయి.  ఒక అద్భుతమైన సినిమా ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను.ఈ సినిమా కోసం అందరిని కష్టపెట్టాను. డైరెక్టర్ శానిల్ తో కలిసి ఒక విజన్ అనుకున్నాను. ఈ సినిమా నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ సినిమాని తీయడం చాలా కష్టం, 45 డిగ్రీల వేడిలో పర్వతాల పైన షూట్ చేశాను అలాగే డ్యాం రోడ్డు పైన చిత్రీకరించాము. సుప్రియ ఈ సినిమాకి కర్త కర్మ క్రియతనే. ఇండస్ట్రీలో కూడా తను ఒక బలం. ఈరోజు సెలబ్రేషన్ లో కనిపిస్తున్న ప్రతి నవ్వు వెనక సుప్రియ గారు ఉన్నారు. నేను కలిసి పనిచేసిన బెస్ట్ ప్రొడ్యూసర్స్ సుప్రియ. మృణాల్ ఈ సినిమాకి మరో బలం. ఈ సినిమా కోసం అన్ని కలిసి వచ్చాయి. ఈ సినిమా కోసం చాలా చాలెంజెస్ ఎదుర్కొన్నాం. చాలా జెన్యూన్ గా ప్రయత్నించాము. సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ ఇచ్చారు. ఇంత అద్భుతమైన సక్సెస్ చేసిన ఆడియన్స్ కృతజ్ఞతలు. నాకు చాలా మంది ఏదైనా టైటిల్ ఇస్తామని చెప్తుంటారు. నేను టైటిల్స్ ని పెద్దగా పట్టించుకోను. నేను కోరుకునే ట్యాగ్ ఒకటే.. గుడ్ సినిమా శేష్. థాంక్యూ.

ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ..ఇలాంటి సినిమా చూసి, ఇంత టాలెంటెడ్ టీమ్‌ను కలిసిన తర్వాత చాలా గర్వంగా అనిపించింది.శేష్ సినిమా హిట్ అయ్యేవరకు తీస్తుంటాడు. సుప్రియ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు.ఈ సినిమా చూసిన తర్వాత ఏ సినిమాతోనూ పోలిక కనిపించలేదు.నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటి. సినిమాలో అందరూ బ్రహ్మాండంగా చేశారు.డైరెక్టర్ శానిల్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు.ఎడిటింగ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చింది. మృణాల్ సరస్వతి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది. ఇది వరకు ఒక అమ్మాయిని ఆశీర్వదించాను, ఆమె వరుణ్ భార్య అయింది (నవ్వుతూ). మృణాల్ కూడా ఇక్కడే ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆమె ఇండస్ట్రీకి చాలా అవసరం. ఈ సినిమా నాకు చాలా నచ్చింది

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. నాకు తెలుగు సినిమాల్లో పరిచయం చేసిన నాగ్ అశ్విన్  గారికి థాంక్యూ. వైజయంతి మూవీస్‌లో హీరోయిన్‌గా మొదలుపెట్టడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పుడు సుప్రియ తో సినిమా చేయడం కూడా అంతే అదృష్టంగా భావిస్తున్నాను. ‘డెకాయిట్’ వంటి అద్భుతమైన సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయం మొత్తం టీమ్‌కే చెందుతుంది. నాపై నమ్మకం ఉంచిన అందరికీ ధన్యవాదాలు. దర్శకుడు శానిల్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో మరో హైలైట్ డీఓపీ ధనుష్ భాస్కర్—ఆయన సినిమాను విజువల్ ట్రీట్‌లా చూపించారు.ఈ సినిమాలో నేను ఫస్ట్ టైమ్ యాక్షన్ చేశాను. ఈ విషయంలో శేష్ గారి సపోర్ట్‌ను మర్చిపోలేను.సరస్వతి లాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తాయి. శేష్ ఇందులో అద్భుతంగా నటించారు.ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. సుప్రియ గారు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.వారి సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నేను గర్వపడే సినిమా.
 
ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మొన్న నాగ వంశీ “నేను క్లాస్ పీకుతాను” అన్నారు (నవ్వుతూ). ఎంత ప్రయత్నం చేసినా ఒక సినిమా చుట్టూ వున్న యూనివర్స్ ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. కొన్నిసార్లు చాలా కోపం వచ్చేది  “ఇదంతా ఎందుకు?” అనిపించేది. కానీ అదే సమయంలో ఒక పాట చరణం, ఎడిటింగ్‌లో ఒక క్లోజ్ షాట్ చూస్తే మళ్లీ ఎనర్జీ వచ్చేది. అదే ముందుకు నడిపించింది.నాకు ఇండస్ట్రీ అన్నీ ఇచ్చింది. ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఏదైనా వదిలి వెళ్లాలి అనేది నా కోరిక. ‘డెకాయిట్’ ప్రేమతో చేసిన సినిమా.ఇది ప్యూర్ లవ్‌కు ఒక ఎక్స్‌ప్రెషన్. ఈ కథకు ప్రాణం పోసిన అందరికీ ధన్యవాదాలు. సినిమా ప్రేక్షకుల మనసును తాకినందుకు చాలా ఆనందంగా ఉంది.
 
ప్రొడ్యూసర్ స్వప్న దత్ మాట్లాడుతూ.. మొన్న ఈవెంట్‌కు సుప్రియ కోసం వచ్చాను, కానీ ఇప్పుడు ఈ సినిమా నచ్చి వచ్చాను. ఇది ఒక బ్రిలియంట్ సినిమా. ప్రతి నిమిషం ప్రాణం పెట్టి తీశారని అనిపించింది. కొద్ది సేపటికే నటులను మర్చిపోయి పాత్రలనే చూస్తాం. ఇది శేష్ కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్. సీత ఇప్పుడు సరస్వతిగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. మృణాల్ సరస్వతి పాత్రలో అద్భుతంగా నటించింది. డైరెక్టర్ శానిల్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. టెక్నికల్‌గా కూడా సినిమా చాలా బ్రిలియంట్‌గా ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ఎవరూ ఫోన్ తాకలేదు ..  అంత ఎంగేజింగ్‌గా ఉంది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను.
 
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ..రాజమౌళి, నాగ్ అశ్విన్ సినిమా రిలీజ్ అవుతుంటే  ఏం  చేశారో చూడాలని ఎక్సైట్మెంట్ ఉంటుంది.అలాగే శేష్ సినిమా వస్తే ఆయన ఏమి కొత్తగా చేస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. సినిమా హిట్ అయ్యే వరకు తీస్తూనే ఉంటారు.  అదే ఆయనకి సినిమా మీద ఉన్న ప్రేమ. మనమిచ్చే 200 రూపాయల టికెట్‌కు వాళ్లు 500 రూపాయల కష్టపడతారు. ఈ ఫంక్షన్‌కు నేను స్వతహాగా వచ్చాను . ఇలాంటి మంచి సినిమాకి సపోర్ట్‌గా ఉండాలని.ఈ సినిమా చూశాను. 200 రూపాయలకు పూర్తిగా న్యాయం చేశారు. తెలుగు సినిమాల్లో క్వాలిటీ చాలా మెరుగవుతోంది.ఈ సినిమా కూడా ఆ క్వాలిటీని చూపించింది. సుప్రియ గారు ఎప్పుడూ ఇండస్ట్రీ గురించి ఆలోచించే మనిషి. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అందరూ చూడండి.
 
డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ..ట్రైలర్ చూసిన వెంటనే సినిమా చూడాలని ఆసక్తి కలిగింది. చాలా వెరైటీగా అనిపించింది.సినిమా చూస్తున్నంతసేపు స్క్రీన్‌కు అతుక్కుపోయాను. నటీనటులు, టెక్నికల్ అంశాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మీరు ఈ సినిమా చూస్తే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. చాలా మంచి లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సుప్రియ గారు అద్భుతమైన ప్రొడ్యూసర్. అందరూ ప్రేమతో ఈ సినిమా చేశారు. శేష్ ప్రతి సినిమాకి బాధ్యత తీసుకుంటాడు. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తాడు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను.
 
డైరెక్టర్ శానిల్ మాట్లాడుతూ..అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఎడిటింగ్, మ్యూజిక్, డీఓపీ ధనుష్ — అందరూ అద్భుతంగా పని చేశారు. నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన సుప్రియకి ధన్యవాదాలు. మా జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.శేష్, మృణాల్ ఈ సినిమాకి సోల్ — అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ప్రేక్షకులు ఇచ్చిన విజయానికి కృతజ్ఞతలు.
 
డీఓపీ ధనుష్ భాస్కర్ మాట్లాడుతూ..సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇది నా ఫస్ట్ సినిమా. ఇంత మంచి బ్యానర్‌లో లాంచ్ అవ్వడం, ఇంత మంచి ఫీడ్బ్యాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. సుప్రియ గారి సపోర్ట్‌ను మర్చిపోలేను. డైరెక్టర్ శానిల్ విజన్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ జర్నీలో నాకు సపోర్ట్‌గా నిలిచిన శేష్ గారికి ధన్యవాదాలు.
 
రైటర్ అబ్బురి రవి మాట్లాడుతూ..మా తమ్ముడు ఫేస్‌కి మరో విజయం రావడం చాలా ఆనందంగా ఉంది. ‘క్షణం’ నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమాను కొత్తగా చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఆ ప్రయత్నం కోసం నిత్యం సంఘర్షణే. ఆ సంఘర్షణకి విజయం దక్కితే ఆనందం వేరేలా ఉంటుంది. ఇదంతా ఒక టీమ్ ఎఫర్ట్. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఆ శ్రమకు ఫలితం దక్కింది. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com