శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- April 14, 2026
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో నకిలీ సిఐఎస్ఎఫ్ అధికారి బాగోతం బట్టబయలైంది. మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటన సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి…. శంషాబాద్ ఎయిర్పోర్టులో సిఐఎస్ఎఫ్ యూనిఫామ్ ధరించి హల్చల్ చేస్తూ ఓ వ్యక్తి అనుమానాస్పరిస్థితిలో కనిపించగా పోలీసులు అతని ఆదుపులోకి తీసుకొని విచారించారు. సదరు వ్యక్తి ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కు చెందిన బాలకృష్ణగా గుర్తించారు. ఇతను ఖరీదైన యూనిఫామ్ దుస్తులు ధరించి తను సిఐఎస్ఎఫ్ అధికారిగా చలమనవతు వచ్చాడు. ఇతని ప్రవర్తన పై అధికారులకు అనుమానం ఏర్పడడంతో వలవేసి పట్టుకున్నారు.
ఇదిలా ఉండగా, ఇతని నేరచరిత్రను పరిశీలించగా, విస్తూపోయే నిజాలు వెలుగు చూసాయి. దాదాపు 67 మంది యువతులకు తన ఫోటోలను మ్యాట్రిమోనీ సెంటర్లలో అప్లోడ్ చేసి పంపడం జరిగింది. వారు ఇతని ఖరీదైన దుస్తులు, మోసపు మాటలు నమ్మారు. నగలు ,నగదు వారి నుంచి వసూలు చేసుకోవడం పారిపోవడం ఇతనికి పరిపాటిగా మారింది. ఎటకేలకు పోలీసులకు చిక్కడంతో గుట్టు రట్టయింది. మ్యాట్రిమోనీలో యువతులు ఎలాంటి మోసగాళ్ల వలలో పడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. నిందితుడు నుంచి ఖరీదైన దుస్తులు, సిఐఎస్ఎఫ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







