ప్రముఖ హాస్య నటులు బాబూమోహన్ కి రేలంగి వెంకట్రామయ్య జాతీయ అవార్డు
- April 15, 2026
హైదరాబాద్: ప్రముఖ హాస్య నటులు మరియు మాజీ మంత్రివర్యులు బాబు మోహన్ 74వ పుట్టిన రోజు పురస్కరించుకొని వారి 41 సంవత్సరాల సినీ జీవితాన్ని గుర్తు చేసుకొంటూ,మంగళవారం రాత్రి బేగంపేట లోని టూరిజం ప్లాజాలో ఇమ్మడి జ్యూయలర్స్ మరియు ఆర్.బి.ఎం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్, ప్రొడ్యూసర్ నాగబాల సురేష్ అధ్యక్షతన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ నుండి లెజెండరీ హాస్య నటులు పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య జాతీయ అవార్డు -2026 ను బాబు మోహన్ కి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఫౌండర్,CEO డాక్టర్ సత్యవోలు రాంబాబు మరియు కమిటీ సభ్యులు డాక్టర్ కిషోర్ కుమార్, పారిశ్రామికవేత్త జగ్గయ్య, ప్రముఖ న్యాయవాది రవి చరణ్ అంద చేసినట్లు డాక్టర్ సత్యవోలు రాంబాబు తెలిపారు.
చిన్న ఉద్యోగి గా తన జీవితాన్ని ప్రారంభించి బాబు మోహన్ తన 41సంవత్సరాల సినీ జీవితం లో రెండు వేలకు పైగా చిత్రాలలో నటించి తన హాస్యంతో విశ్వవ్యాప్తంగా తెలుగు ప్రజల హృదయాలను దోచుకొన్నారు.మాయలోడు సినిమాలో సౌందర్య లాంటి గొప్ప హీరోయిన్ తో చినుకు చినుకు అందెలతో...అనే సాంగ్ కు గొప్ప పేరు రావడమే కాకుండా కేవలం బాబూమోహన్ గారి వల్లే థియేటర్లలో 365రోజులు సినిమా ఆడి ప్రభంజనం సృష్టించింది.
హిట్లర్, మాయలోడు, రాజేంద్రుడు -గజేంద్రుడు, హలో బ్రదర్, మామగారు,జమ్బలికడి పంబ, పెదరాయుడు, అప్పుల అప్పారావు, ముగ్గురు మొనగాళ్లు, సాహస వీరుడు సాగర కన్య లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో వారి నటనకు అపూర్వ మన్ననలు లభించాయి.
విశ్వ విఖ్యాత నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు సారధ్యంలో బాబు మోహన్ రాజకీయ ప్రవేశం చేసి, ఎం.ఎల్.ఏ గా, మంత్రి గా ప్రజా సేవలో వారి మార్క్ ను ముద్రించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు తనికెళ్ల భరణీ, ప్రముఖ దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ చలన చిత్ర దర్శకులు రేలంగి నరసింహారావు,సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్.ఆదిత్య, ప్రముఖ చలన చిత్ర నిర్మాత అచ్చిరెడ్డి, ప్రముఖ చలన చిత్ర దర్శకులు కృష్ణారెడ్డి, ప్రముఖ సినీ పాత్రికేయులు ఎ.ప్రభు, నాగేంద్ర,ఇమ్మడి జ్యూయలర్స్ అధినేత ఇమ్మడి రమేష్, ఆర్.బి.ఏం ఫౌండర్ శివ ప్రసాద్, ప్రముఖ నటులు మిమిక్రీ కళాకారులు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







