‘రేజర్’ ఇంటెన్స్ & వైల్డ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
- April 18, 2026
ఫార్ములా కథలకు దూరంగా, కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రవి బాబు, తన తాజా చిత్రం ‘రేజర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
అవసరంలో ఉన్నవారికి దేవుడు రక్షకుడిగా దేవదూతను పంపుతాడని అంటారు. కానీ మరణం వెంబడిస్తూనే ఉండి, తప్పించుకోవడం అసాధ్యమయ్యే సమయంలో అదే దేవదూత విధ్వంసానికి ప్రతీకగా మారుతుంది. కరుణ మాయమైతే మిగిలేది కేవలం ఆగ్రహం మాత్రమే. తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు కోపం, క్రోధం, కలహం, విధ్వంసం.. అన్నీ కలిసి ‘రేజర్’గా మారుతుంది
ట్రైలర్ ఒక డార్క్, ఫెరోషియస్ ప్రపంచాన్ని సూచిస్తోంది. ఈ కథలో రవి బాబు ఒక డాగ్ గ్రూమర్‌గా కనిపిస్తారు. ఒక చిన్న అమ్మాయిని కాపాడేందుకు అతను ఎంతవరకు వెళ్తాడో చూపించే పాత్ర ఇది. ఎమోషన్ ఇంటెన్సిటీ రెండింటినీ బ్యాలెన్స్ గా చూపించే పాత్రగా ఆసక్తిని పెంచింది.
రచయిత, దర్శకుడిగా రవి బాబు తన ప్రత్యేక స్టయిల్ ని కొనసాగిస్తూ, ఈసారి మరింత అందరికీ చేరువయ్యే కథనంతో ముందుకొచ్చారు. సాంకేతికంగా కూడా ఈ చిత్రం బలంగా ఉంది. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ, ఎస్‌ఎస్ రాజేష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సతీష్ పొలుజు యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ కలిసి సినిమాకు మరింత బలం చేకూర్చాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ట్రైలర్ ఆసక్తిని పెంచుతూ ‘రేజర్’ను ఒక హై-వోల్టేజ్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుందని ప్రామిస్ చేస్తోంది.మే 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







