IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- April 20, 2026
ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. పంజాబ్ ఖాతాలో మరో విజయం చేరింది.లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో పంజాబ్ దుమ్ము రేపింది. లక్నో పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది.పంజాబ్ బ్యాటర్లు సిక్సర్లు సునామీ సృష్టించారు. పరుగుల వరద పారించారు. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ (87) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 255 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేయగలిగింది. ఫలితంగా 54 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపొందింది.ఈ సీజన్ లో పంజాబ్ కు ఇది వరుసగా 5వ విజయం. ఆడిన అన్ని మ్యాచుల్లో గెలుపొందింది. ఒక్క ఓటమి కూడా లేదు. అటు లక్నో జట్టుకి హ్యాట్రిక్ పరాజయం.
తాజా వార్తలు
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!







