డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- April 25, 2026
యూఏఈ: జెబెల్ అలీ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని ఇంధనం దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేస్తోంది.
పోలీసు నివేదికల ప్రకారం, జెబెల్ అలీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వాహనాల నుండి డీజిల్ దొంగతనాలకు సంబంధించి పలు ఫిర్యాదులు అందాయి. వరుస కేసులు నమోదయ్యాయి. దుబాయ్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందాలు జరిపిన దర్యాప్తులో, నిందితులు పదేపదే ఉపయోగిస్తున్న ఒక ఫ్యాటర్న్ ను తెలుసుకున్నారు.
ఈ ముఠా ముందుగానే పంపులు, హోసులు మరియు వెనుక భాగంలో నిల్వ ట్యాంకులను అమర్చిన ఫోర్-వీల్-డ్రైవ్ వాహనాలను ఉపయోగించినట్లు గుర్తించారు. నిందితులు పార్క్ చేసి ఉన్న ట్రక్కుల వద్దకు వాహనాలను నడుపుకుంటూ వచ్చి, ప్రత్యేకంగా ఇంధన ట్యాంక్ ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకునేవారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వారు ఫ్యూయల్ క్యాప్‌ను పగలగొట్టి, డీజిల్‌ను తమ సొంత నిల్వ ట్యాంకుల్లోకి సైఫన్ చేసి, అక్కడి నుంచి పారిపోయేవారు. ఈ నేరాల వెనుక ఉద్దేశ్యం అక్రమ మార్గాల ద్వారా ఆర్థిక లాభం పొందడమేనని, దొంగిలించిన డీజిల్‌ను తిరిగి అమ్మడమేనని భావిస్తున్నారు.
సాధారణంగా ట్రక్కులను పార్క్ చేసి ఉంచే ప్రాంతాల్లో పోలీసులు గస్తీ, నిఘా కార్యకలాపాలను ముమ్మరం చేశారు. జెబెల్ అలీ దర్యాప్తు బృందాలు, రవాణా సంబంధిత విభాగాల మధ్య సమన్వయంతో అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అరబ్ నివాసితులను అరెస్టు చేశారు. వారు సిరియా జాతీయులని, యూఏఈలో నివసిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇద్దరికీ నేరచరిత్ర ఉందని కూడా నిర్ధారించారు. అనుమానితులను పట్టుకున్నామని, చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి సంబంధిత అధికారులకు అప్పగించామని అధికారులు ధృవీకరించారు.
రవాణా సంస్థలు, ట్రక్కు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఇంధన ట్యాంకులను సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి నేరాలు తరచుగా నిర్మానుష ప్రదేశాలలో ట్రక్కులను లక్ష్యంగా చేసుకుంటాయని పేర్కొంటూ, వాహనాలను కేటాయించిన పర్యవేక్షించే ప్రాంతాల్లో మాత్రమే పార్క్ చేయాలని అధికారులు కంపెనీలను కోరారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







