కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్‌వేస్
- April 25, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 5 (T5) వద్ద తన కార్యకలాపాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ను జజీరా ఎయిర్‌వేస్ ప్రకటించింది. కువైట్ నుండి డైరెక్ట్ విమానాలు ఏప్రిల్ 26 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ విమానయాన సంస్థ రియాద్ మరియు జెడ్డాకు కొత్త డైరెక్ట్ మార్గాలను ప్రవేశపెట్టడం ద్వారా తన ప్రాంతీయ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. తద్వారా సౌదీ అరేబియాతో అనుసంధానాన్ని మెరుగుపరుస్తోంది.
దశలవారీగా పునఃప్రారంభించే ఈ ప్రక్రియలో భాగంగా జజీరా ఎయిర్‌వేస్ కువైట్ నుండి అమ్మాన్, బీరూట్, ముంబై, కైరో, కొచ్చి, ఢిల్లీ మరియు ఇస్తాంబుల్‌తో సహా 10 గమ్యస్థానాలకు డైరెక్ట్ విమానాలను నడుపుతుంది. ఇదిలా ఉండగా, ఇతర గమ్యస్థానాలకు విమాన సర్వీసులు దమ్మామ్ విమానాశ్రయం ద్వారా కొనసాగుతాయి. ప్రయాణికులు మిష్రెఫ్‌లోని కువైట్ అంతర్జాతీయ ఫెయిర్‌గ్రౌండ్స్‌లోని టెర్మినల్ 8లో చెక్-ఇన్ చేసుకుని, అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో దుబాయ్‌కు కూడా దమ్మామ్ ద్వారా సర్వీసులు కొనసాగుతాయి.
ప్రస్తుత ఆంక్షల నేపథ్యంలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు, టెర్మినల్ 5 నుండి బయలుదేరే ప్రయాణికుల కోసం ఎయిర్‌లైన్ ఒక అప్డేట్ చేసిన చెక్-ఇన్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. టెర్మినల్ 5కు చేరుకునే ప్రయాణికులను మొదట పార్క్ & ఫ్లై సదుపాయానికి పంపిస్తారు. అక్కడి నుండి బస్సుల ద్వారా వారిని చెక్-ఇన్ మరియు బోర్డింగ్ ప్రక్రియల కోసం టెర్మినల్‌కు తీసుకువెళతారు. ఈ వ్యవస్థ ప్రయాణికుల రాకపోకలు సజావుగా సాగేలా మరియు సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా రూపొందించారు.
రియాద్, జెడ్డా మరియు డమాస్కస్ వంటి కీలక గమ్యస్థానాలకు విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంటూ.. ఎయిర్‌లైన్ సంతోషంగా ఉందని జజీరా ఎయిర్‌వేస్ సీఈఓ బరతన్ పశుపతి తెలిపారు. ఈ దశలో లాభదాయకత కంటే సమాజ సేవకే ప్రాధాన్యతనిస్తూ, ఎయిర్‌లైన్ తన డైరెక్ట్ నెట్‌వర్క్‌ను క్రమంగా విస్తరిస్తూనే ఉంటుందని ఆయన చెప్పారు.
ప్రయాణీకులు తమ విమాన వివరాలను మరియు బయలుదేరే సూచనలను ముందుగానే తనిఖీ చేసుకోవాలని, అలాగే అన్ని ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయడానికి ముందుగానే చేరుకోవాలని సూచించడమైనది.
కువైట్ నుండి నేరుగా విమాన సర్వీసుల షెడ్యూల్ (T5):
జెడ్డా: వారానికి రెండుసార్లు (సోమవారం, గురువారం)
రియాద్: వారానికి రెండుసార్లు (బుధవారం, శుక్రవారం)
కొచ్చి: వారానికి మూడుసార్లు (బుధవారం, గురువారం, శనివారం)
కైరో: ప్రతిరోజూ
డమాస్కస్: వారానికి నాలుగుసార్లు (సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం)
బీరూట్: వారానికి రెండుసార్లు (శుక్రవారం, ఆదివారం)
ఢిల్లీ: వారానికి నాలుగుసార్లు (మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం)
ముంబై: ప్రతిరోజూ
అమ్మాన్: వారానికి మూడుసార్లు (సోమవారం, మంగళవారం, శనివారం)
ఇస్తాంబుల్: వారానికి నాలుగుసార్లు (సోమవారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం)
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







