‘శ్రీనివాస మంగాపురం’ నుంచి బాలుగా బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ రిలీజ్
- April 26, 2026
RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు.
రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘బాలు’ పాత్రలో ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో మైక్ పట్టుకొని హ్యాపీ వైబ్ లో కనిపించారు బ్రహ్మాజీ.
‘బాలు’ పాత్ర అందరిని థియేటర్లలో పక్కాగా ఎంటర్టైన్ చేయబోతుంది.
అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. పి కిరణ్ నిర్మిస్తున్నారు.
టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సంగీతాన్ని జివి ప్రకాశ్ కుమార్ సమకూరుస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ ISC, ఎడిటింగ్ బాధ్యతలను మాధవ్ కుమార్ గుల్లపాటి నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్. హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు: జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తాడాని, మోహన్ బాబు, డా. నరేష్ వికే
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
సమర్పణ: అశ్విని దత్
నిర్మాత: పి.కిరణ్
బ్యానర్: చందమామ కథలు
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: జయకృష్ణ ISC
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్లపాటి
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాకమూరి నారాయణ స్వామి
ఫైట్స్: రియల్ సతీష్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







