కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- April 26, 2026
కువైట్ సిటీ: కువైట్ జాతీయ విమానయాన సంస్థ ‘కువైట్ ఎయిర్వేస్’ ముందస్తుగా బుక్ చేసుకున్న టికెట్లను అకస్మాత్తుగా రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే, జూన్ నెలల ప్రయాణాల కోసం ముందుగానే రిజర్వేషన్లు చేసుకున్న పలువురు, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తమ బుకింగ్స్ రద్దు అయ్యాయని ఆరోపిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ చర్య వల్ల ప్రయాణ ప్రణాళికలు దెబ్బతిన్నాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా అత్యవసర పనులు, కుటుంబ కార్యక్రమాల కోసం ప్రయాణం ప్లాన్ చేసినవారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
టికెట్లు రద్దు చేసిన కారణాలపై స్పష్టత ఇవ్వాలని ప్రయాణికులు కువైట్ ఎయిర్వేస్ అధికారులను కోరుతున్నారు. ఇప్పటికే చెల్లించిన మొత్తానికి పూర్తి రీఫండ్ ఇవ్వాలని, అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటివరకు ఈ అంశంపై కువైట్ ఎయిర్వేస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. పరిస్థితిపై స్పష్టత కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







