IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- April 27, 2026
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఊచకోత కోశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్లకు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఢిల్లీని కోలుకోలేని దెబ్బ తీశారు.
దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 75 పరుగులకే కుప్పకూలింది.ఇంప్యాక్ట్ సబ్ జాకబ్ బెథెల్(20)ను మూడో ఓవర్లోనే నటరాజన్ స్టన్నింగ్ క్యాచ్‌తో వెనక్కి పంపినా దేవ్‌దత్ పడిక్కల్(34 నాటౌట్), విరాట్ కోహ్లీ(23 నాటౌట్)దంచేశారు. జేమీసన్ ఓవర్లో పడిక్కల్ 6, 4, 6 తో స్కోర్ 60కి చేరింది. నటరాజ్ వేసిన 7వ ఓవర్లో కోహ్లీ వరసగా రెండు సిక్సర్లు బాదడంతో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పవర్ ప్లేలోనే ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్(3-5), హేజిల్‌వుడ్(4-12) వికెట్ల వేటతో ఢిల్లీ బ్యాటర్లు సున్నాలు చుట్టేశారు. బంతిని స్వింగ్ చేస్తూ ఇద్దరూ వికెట్ల పండుగ చేసుకోగా 8 పరుగులకే ఆరు వికెట్లు పడ్డాయి. డేవిడ్ మిల్లర్(19), ఇంప్యాక్ట్ సబ్ అభిషేక్ పొరెల్(30) పోరాటంతో కోలుకునట్టే కనిపించినా.. హేజిల్‌వుడ్ యార్కర్‌తో అతడిని బౌల్డ్ చేయగా ఢిల్లీ ఇన్నింగ్స్ 16.3 ఓవర్లలోనే ముగిసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







