మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!
- April 29, 2026
ముంబై: మీకు మే నెలలో బ్యాంకులో పని ఉందా? అయితే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. వచ్చే నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ముందుగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మే 1వ తేదీన బ్యాంకులు పనిచేయవు.
ముందుగా సమాచారం లేకుండా బ్యాంకుకు వెళ్లడం ద్వారా మీ సమయం వృధా అవుతుంది. అందుకే ముందుగానే సెలవుల (Bank Holidays May 2026) షెడ్యూల్‌ను చెక్ చేసుకుని దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోవడం మంచిది.
మే 1వ తేదీన చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. కొన్ని చోట్ల ఇదే రోజున మహారాష్ట్ర దినోత్సవం, కార్మిక దినోత్సవం, బుద్ధ పౌర్ణమి, ఇంకా స్థానిక పండుగలు జరుపుకుంటారు. అందువల్ల, మీకు ఏవైనా ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవడం బెటర్.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకారం.. మే 1వ తేదీన చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. అయితే, గుజరాత్, ఒడిశా, చండీగఢ్, సిక్కిం, రాజస్థాన్, నాగాలాండ్ మేఘాలయలలో బ్యాంకులు తెరిచి ఉంటాయి. బ్యాంకులతో పాటు, ఈ రోజున అనేక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు పోస్టాఫీసులు కూడా మూతపడతాయి.
అయితే, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, యూపీఐ ఏటీఎం సేవలు యధావిధిగా పనిచేస్తాయి. మే 2వ తేదీ శనివారం రెండో లేదా నాల్గవ శనివారం కాదు.. ఆ రోజు బ్యాంకులు తెరిచే ఉంటాయి.
2026 మే నెలలో బ్యాంకులు ఎప్పుడు సెలవులు ఉన్నాయంటే? :
వీకెండ్స్, రాష్ట్ర సెలవులతో కలిపి మే నెలలో బ్యాంకులు మొత్తంగా సుమారు 12 రోజుల పాటు మూతపడతాయి.
మే 1 (శుక్రవారం) : మహారాష్ట్ర దినోత్సవం, కార్మిక దినోత్సవం, బుద్ధ పౌర్ణమి (చాలా రాష్ట్రాల్లో సెలవుదినం)
మే 3, 10, 17, 24, 31 : ఆదివారం (దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు)
మే 9 (శనివారం) : రెండవ శనివారం (దేశవ్యాప్తంగా సెలవుదినం), పశ్చిమ బెంగాల్‌లో రవీంద్రనాథ్ టాగోర్ జయంతి.
మే 16 : సిక్కింలో రాష్ట్ర దినోత్సవం
మే 23 : నాల్గవ శనివారం (దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు)
మే 26 : త్రిపురలో కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి
మే 27: బక్రీద్ (కొన్ని రాష్ట్రాలు మినహా చాలా చోట్ల బ్యాంకులు పనిచేయవు)
మే 28 : ఇతర రాష్ట్రాల్లో బక్రీద్ సెలవుదినం (ఏపీ, తెలంగాణ )
బ్యాంకు సెలవులు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. మీ ఇంటి నుంచి బయలుదేరే ముందు మీ సిటీ, సెలవుల సమాచారాన్ని తప్పకుండా చెక్ చేసుకోండి. చెక్కులను క్లియర్ చేయడం, క్యాష్ డిపాజిట్ చేయడం లేదా డ్రాఫ్ట్‌లు చేయడం వంటి బ్యాంకు సెలవులకు ముందే పూర్తి చేయండి.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







