NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- April 29, 2026
దేశంలోని అతిపెద్ద ఇంధన సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఖాళీగా ఉన్న 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలన్నీ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన (మూడేళ్లు, మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంది) భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రభుత్వ రంగ సంస్థలో పని చేసేందుకు ఇది ఒక గొప్ప అవకాశం.
NTPC Recruitment: అర్హతలు
- విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ (B.E) లేదా బీటెక్ (B.Tech) (ఎలక్ట్రికల్/మెకానికల్) విభాగాల్లో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (SC/ST/PwBD అభ్యర్థులు కేవలం పాస్ మార్కులతో దరఖాస్తు చేసుకోవచ్చు).
- అనుభవం: అభ్యర్థులకు 40 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్‌లో ఆపరేషన్ లేదా మెయింటెనెన్స్‌లో కనీసం ఒక ఏడాది పని అనుభవం ఉండాలి.
- వయోపరిమితి: దరఖాస్తుదారుల వయస్సు 35 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- జీతం, ఎంపిక ప్రక్రియ
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 55,000 (Fixed Consolidated) జీతంతో పాటు హెచ్‌ఆర్ఏ (HRA), నైట్ షిఫ్ట్ అలవెన్స్, మెడికల్ సదుపాయాలు లభిస్తాయి.
ఎంపిక విధానం: అభ్యర్థుల దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ (రాత పరీక్ష) వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
దరఖాస్తు రుసుము: జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ. 500. మహిళలు, SC/ST, PwBD మరియు మాజీ సైనికోద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంది.
చివరి తేదీ: మే 7, 2026.
అధికారిక వెబ్‌సైట్: http://careers.ntpc.co.in
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







