దృశ్యం 3 టీజర్ చూశారా..
- April 29, 2026
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ ఏదైనా ఉంది అంటే అది ‘దృశ్యం 3(Drishyam 3 Teaser)’ అనే చెప్పాలి. ఈ సిరీస్ లో వచ్చిన గత రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సీక్వెల్ పై అంచనాలు ఒక రేంజ్ లో నెలకొన్నాయి. అందుకే, దృశ్యం 3 రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మలయాళ ఒరిజినల్ వెర్షన్ మే 21న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ టీజర్ కు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
దానికి కారణం, టీజర్లో ఎక్కువ భాగం గత రెండు సినిమాల ఫుటేజ్‌నే వాడటం, చివర్లో మోహన్ లాల్ చర్చిలో చెప్పే సుదీర్ఘ డైలాగ్ తప్ప కొత్తగా ఏమీ లేకపోవడంతో ప్రేక్షకులు కొంత నిరాశ చెందుతున్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ మూడవ భాగాన్ని ఫ్రాంచైజీలోనే చివరి చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.మోహన్ లాల్ కుటుంబం దాచిన ఆ శవం చివరకు బయటపడుతుందా లేదా అనే ప్రధానాంశంతో ఈ కథ సాగనుంది. అయితే ఈసారి కేవలం మైండ్ గేమ్స్, ట్విస్టులకే పరిమితం కాకుండా ఎమోషన్స్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఒక మంచి సందేశాన్ని కూడా జోడించినట్లు సమాచారం. ఈ సినిమాతో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌కు ఒక పరిపూర్ణమైన ముగింపు పలకాలని చిత్ర బృందం భావిస్తోంది. మరి భారీ అంచనాల మధ్య రానున్న ఈ సినిమా ఆడియన్స్ కి ఎలాంటి అనుభూతిని అందిస్తుందిఆ అనేది చూడాలి.
మరోవైపు హిందీలో అజయ్ దేవగన్ నటిస్తున్న ‘దృశ్యం 3’పై కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ వెర్షన్‌కు భిన్నంగా హిందీ కోసం అజయ్ దేవగన్ ఒక కొత్త కథను సిద్ధం చేయించుకున్నారని, ఇది అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ సమాచారం. ఇక తెలుగులో వెంకటేష్ ఈ రీమేక్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మలయాళ వెర్షన్ మే 21న విడుదలయ్యాక, అక్కడ వచ్చే ఫలితాన్ని బట్టి తెలుగు రీమేక్ పై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







