తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- May 01, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ (DGP)గా 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ పొందిన బి.శివధర్ రెడ్డి స్థానంలో ఆయన ఈ అత్యున్నత బాధ్యతలను చేపట్టారు.ఇప్పటి వరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన ఆయనకు మూడు దశాబ్దాలకు పైగా పోలీస్, పరిపాలనా విభాగాల్లో అపారమైన అనుభవం ఉంది.
కెరీర్ ప్రారంభం, కీలక బాధ్యతలు
సీవీ ఆనంద్ తన పోలీస్ ప్రస్థానాన్ని వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)గా ప్రారంభించారు. కెరీర్ తొలి తొమ్మిదేళ్ల పాటు వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో పని చేశారు.క్షేత్రస్థాయిలో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో స్వయంగా పాల్గొని పలు ఎన్కౌంటర్లలో సాహసాన్ని ప్రదర్శించారు.
నగర పోలీస్ కమిషనర్‌గా హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి మెట్రో పాలిటన్ పోలీసింగ్‌లో తనదైన ముద్ర వేశారు. అలాగే విజయవాడ కమిషనర్‌గా కూడా సేవలందించారు.

తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







