ఒమన్‌లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- May 02, 2026
మస్కట్: ఒమన్ లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. రాయల్ హాస్పిటల్ లివర్ పేషెంట్ల రిజిస్ట్రీ ప్రకారం, జీవనశైలి కారణంగా లివర్ సిర్రోసిస్ (LC) వల్ల కాలేయ మార్పిడి అవసరమయ్యే రోగుల సంఖ్య పెరుగుతోంది.
రాయల్ హాస్పిటల్‌లోని లివర్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగం ప్రకారం, యువతలో కనిపించే చాలా వరకు LC సమస్యలకు ఫ్యాటీ లివర్, అనారోగ్యకరమైన ఆహారం వంటివి కారణమవుతున్నాయని, బాధితుల వయస్సు 60, 70ల నుండి 40, 50లకు మారిందని వెల్లడించారు.
"మా రిజిస్ట్రీ ప్రకారం, ఒమన్‌లో ఫ్యాటీ లివర్ కేసులు, ప్రత్యేకంగా మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) కేసులు వేగంగా పెరుగుతున్నాయి." అని రాయల్ హాస్పిటల్లో లివర్ డొనేషన్ కోఆర్డినేటర్ సుమయ్యా అల్ హర్తి అన్నారు.
అధ్యయనాల ప్రకారం, ఫ్యాటీ లివర్ వ్యాప్తి 67.3 శాతం వరకు చేరుకుందని మరియు కొన్ని సందర్భాల్లో ఇది తరచుగా ఊబకాయం మరియు మధుమేహంతో ముడిపడి ఉందని (ఒక అధ్యయనంలో 58.3 శాతం మంది రోగులలో) తెలిపారు.
"లివర్ సిర్రోసిస్ అనేది దీర్ఘకాలిక హెపటైటిస్ మరియు ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి పరిస్థితుల వల్ల కలిగే, కాలేయంపై దీర్ఘకాలికంగా మచ్చలు ఏర్పడే (ఫైబ్రోసిస్) చివరి దశ వ్యాధి. ఇది ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం చేస్తుందని, చివరకు లీవర్ వైఫల్యానికి కారణమై, శాశ్వతమైన, కోలుకోలేని లీవర్ కణజాలానికి నష్టాన్ని కలిగిస్తుంది." అని డాక్డర్లు వివరించారు.
రిజిస్ట్రీ ప్రకారం, ఒమన్‌లోని లివర్ సిర్రోసిస్ కేసులలో మూడింట ఒక వంతుకు MASLD/NAFLD కారణం. దీని జీవక్రియ సంబంధిత సమస్యల కారణంగా కాలేయ మార్పిడికి ఇది ఒక ప్రధాన కారణంగా గుర్తించారు.
ఇది ఒక 'నిశ్శబ్ద' వ్యాధి అని, ఇది ముదిరే వరకు తరచుగా ఎటువంటి లక్షణాలను చూపదన్నారు. అలసట, కామెర్లు, వాపు మరియు సులభంగా కమిలిపోవడం వంటివి దీని ప్రధాన లక్షణాలని, మరింత నష్టం జరగకుండా నివారించడానికి వీటికి తక్షణ, తరచుగా జీవితకాల చికిత్స అవసరం అని పేర్కొన్నారు.
"గతంలో ఇది 60 లేదా 70 ఏళ్ల వయసు వారిలో కనిపించేది. కానీ ఈ మధ్యకాలంలో యువతలో అంటే 40, 50 ఏళ్ల మధ్య వయసు వారిలో కూడా ఈ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. వీరికి లీవర్ మార్పిడి అవసరమవుతోంది. అంతేకాకుండా, ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు." అని అల్ హర్తి తెలిపారు.
ఈ నిశ్శబ్ద పరిస్థితి లివర్ సిర్రోసిస్..క్యాన్సర్ మరియు గుండె సంబంధ సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరించారు. దీని పెరుగుదలను నియంత్రించడానికి జీవనశైలి మార్పులు మరియు మెరుగైన స్క్రీనింగ్ కార్యక్రమాలు అవసరం అని తెలిపారు.
"చురుకైన జీవనశైలి, తక్కువ చక్కెర మరియు తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారంతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ద్వారా ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చు. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా ఊబకాయం ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించబడింది." అని అల్ హర్తి అన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







