ఒకప్పటి యాక్షన్ హీరో..వీడియో చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్
- May 05, 2026
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన భానుచందర్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి, చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు పోటీనిస్తూ అనేక విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించారు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా, సహాయ నటుడిగానూ తనదైన ముద్ర వేసిన ఆయన, ప్రస్తుతం 70 ఏళ్లు పైబడిన వయసులో అరుదుగా వెండితెరపై కనిపిస్తున్నారు.
తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమలాపురానికి చెందిన ప్రముఖ వంట మాస్టర్ చిట్టిబాబు వివాహ వార్షికోత్సవం సందర్భంగా భానుచందర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆయన నెరిసిన జుట్టు, తెల్లటి గడ్డంతో పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పటి చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న ఈ యాక్షన్ స్టార్‌ను గుర్తుపట్టడం కష్టంగా మారిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రూపం మారినప్పటికీ, భానుచందర్ మాటల్లోని గాంభీర్యం మాత్రం అలాగే ఉందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 2022లో వచ్చిన ‘శాకిని డాకిని’, 2024లో విడుదలైన ‘రామ్’, ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. వయసు రీత్యా వచ్చిన ఈ మార్పు సహజమేనని, ఇప్పటికీ ఆయన వాయిస్ బేస్ వింటే పాత భానుచందర్ గుర్తుకొస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







