కార్మికుల హక్కులు, సంస్కరణలపై ఫస్ట్ జాయింట్ మీటింగ్..!!
- May 06, 2026
కువైట్: కార్మికుల హక్కులపై కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమీక్షించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్‌తో సంయుక్త సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సమావేశానికి మానవ హక్కుల వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి అంబాసిడర్ షేఖా జవాహెర్ ఇబ్రహీం అల్-దువాజ్ అల్-సబా, న్యాయ వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి తహానీ అల్-నాసర్, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డైరెక్టర్ జనరల్ రబాబ్ అల్-ఒసైమీతో పాటు సంబంధిత అధికారుల నుండి అధికారులు, నిపుణులు హాజరయ్యారు.
అంతర్జాతీయ కార్మిక మార్కెట్ సమస్యలపై సహకారాన్ని విస్తరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను అథారిటీ డైరెక్టర్ అల్-ఒసైమీ వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్మికులను పంపే దేశాలతో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా కార్మికుల నియామక యంత్రాంగాలను ఆధునికీకరించనున్నట్లు పేర్కొన్నారు.
యజమానులు మరియు కార్మికుల హక్కులను నియంత్రించే చట్టాలను అప్డేట్ ప్రతిపాదనలు, అంతర్జాతీయ పరిశీలనలపై సమన్వయం మరియు కువైట్‌లో వాటి అమలు, ఇంకా కార్మికులను పని చేసే దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడం వంటి అనేక వ్యూహాత్మక అంశాలపై చర్చలు జరిగాయని అన్నారు.
కార్మిక విపణిని నియంత్రించడం, నియామక వనరులను వైవిధ్యపరచడం, మరియు సేవా నాణ్యతను మెరుగుపరచడం వంటి విస్తృత కార్యక్రమాలలో భాగంగా, గృహ కార్మికులను నియమించుకోవడానికి కొత్త మార్గాలను తెరిచే మార్గాలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒప్పందాలు మరియు మానవ హక్కులపై రెండు అంతర్జాతీయ చట్టాలను కూడా సమీక్షించినట్లు తెలిపారు. కార్మికుల హక్కులను మరింత సమర్థవంతంగా పరిష్కరించడానికి అందరిని ఒక చోటకు చేర్చిన ఘనత ఇదేనని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







