IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- May 12, 2026
ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్ (GT), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన కీలక పోరులో గుజరాత్ ఘనవిజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ బౌలర్ల ధాటికి కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
స్టార్ బ్యాటర్లతో నిండిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ మరియు హెన్రిచ్ క్లాసెన్ వంటి దిగ్గజాలు దారుణంగా విఫలమయ్యారు. 14.5 ఓవర్లలోనే 86 పరుగులకు SRH ఆలౌట్ అయ్యింది. చివరి వికెట్‌గా ప్రఫుల్ హింగేను రషీద్ ఖాన్ అవుట్ చేయగా, జోస్ బట్లర్ మెరుపు వేగంతో స్టంపింగ్ పూర్తి చేశాడు.
గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా 3 వికెట్లతో చెలరేగగా, జేసన్ హోల్డర్ 2 వికెట్లు, మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. చివర్లో రషీద్ ఖాన్ తన మ్యాజిక్‌తో మ్యాచ్‌ను ముగించాడు. సీజన్‌లోనే ఇది అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







