వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- May 13, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. వెనెజువెలాను అమెరికాలోని 51వ రాష్ట్రంగా పేర్కొంటూ ఆయన షేర్ చేసిన గ్రాఫిక్ పోస్టు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ట్రంప్ మంగళవారం తన సామాజిక మాధ్యమ ఖాతాలో ఒక గ్రాఫిక్ ఫొటోను పోస్టు చేశారు. అందులో వెనెజువెలాను అమెరికాలో కొత్త రాష్ట్రంగా చూపిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్టు విడుదలైన వెంటనే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
వెనెజువెలా తీవ్ర అభ్యంతరం
ట్రంప్ పోస్టుపై వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా చేసిన వ్యాఖ్యలు తమ దేశ సార్వభౌమాధికారాన్ని అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పోస్టులో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తున్న దృశ్యాన్ని కూడా చూపించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ధరించిన ట్రాక్ సూట్‌ను పోలిన దుస్తుల్లో ఆయన కనిపించడం మరింత చర్చకు దారి తీసింది.
చైనా పర్యటనకు ముందు పోస్టు
డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం కోసం చైనాకు వెళ్లనున్న సమయంలో ఈ పోస్టు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ దౌత్య సంబంధాల పరంగా కూడా ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైట్ హౌస్ కూడా ఈ గ్రాఫిక్ ఫొటోలను తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకోవడంతో వివాదం మరింత పెరిగింది. ఇటీవల ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వెనెజువెలాను అమెరికాలో భాగంగా పరిగణించాలని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
రాజకీయ వర్గాల్లో చర్చ
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై అమెరికా, లాటిన్ అమెరికా రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని రాజకీయ వ్యూహంగా భావిస్తుండగా, మరికొందరు అంతర్జాతీయ సంబంధాలకు ఇది ప్రతికూలంగా మారొచ్చని అంటున్నారు. వెనెజువెలా-అమెరికా సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ తాజా పోస్టు మరింత వివాదానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







