'ఇట్లు అర్జున' ఫస్ట్ సింగిల్ మే 28న రిలీజ్
- May 22, 2026
స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. “న్యూ గై ఇన్ టౌన్” అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. అక్కినేని నాగార్జున ఇచ్చిన పవర్ఫుల్ వాయిస్ ఓవర్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం విడుదలైన పోస్టర్లు, ‘ఫైండింగ్ అర్జున’ అనే స్పెషల్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
తాజాగా చిత్ర బృందం మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుడుతూ ఓ సరదా ప్రోమోను విడుదల చేసింది. పియానోపై ఓ ట్యూన్ వాయించేందుకు అనీష్ ప్రయత్నిస్తుండగా, మ్యూజిక్ సెన్సేషన్ 'ఓజీ” థమన్ ఎస్ కాఫీ మగ్ చేతిలో పట్టుకుని అతన్ని ఆసక్తిగా గమనిస్తుంటారు.
ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగే ఫన్నీ సంభాషణ ఆకట్టుకుంటుంది. అనీష్ వాయిస్తున్న ట్యూన్‌ను చూసి సరదాగా ఆటపట్టించిన థమన్, అనంతరం తనదైన శైలిలో మ్యూజికల్ మ్యాజిక్‌ను రివిల్ చేశారు. ఆయన అందించిన సాఫ్ట్ మెలోడీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ సింగిల్‌ను మే 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రంలో హీరో పాత్ర చెవిటి, మూగ యువకుడు కావడంతో సంగీతం కథలో మరింత కీలక పాత్ర పోషించనుంది. థమన్ సంగీతంలో రూపొందుతున్న ఈ ఆల్బమ్ సినిమా భావోద్వేగాలను మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేయనుంది. ప్రోమోను బట్టి చూస్తే ఫస్ట్ సింగిల్ ఒక బ్యూటీఫుల్ మెలోడీగా సంగీత ప్రియులను అలరించనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







