#DQ41, #SLV10 కీలక షెడ్యూల్ పూర్తి
- May 24, 2026
దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే, రవి నెలకుడితి, సుధాకర్ చెరుకూరి, ఎస్ఎల్వి సినిమాస్ పాన్ ఇండియా చిత్రం #DQ41, #SLV10 కీలక షెడ్యూల్ పూర్తి- ఆకట్టుకునే వర్కింగ్ స్టిల్స్ రిలీజ్
వర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తన 41వ చిత్రం #DQ41 షూటింగ్లో బిజీగా ఉన్నారు. రవి నెలకుడితి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన ప్రతిష్టాత్మక ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బ్యానర్ నుంచి వస్తున్న 10వ చిత్రం #SLV10గా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. దుల్కర్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, అద్భుతమైన భావోద్వేగాలతో కూడిన అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజాగా చిత్ర బృందం మంచుతో కప్పుకున్న అద్భుతమైన ప్రకృతి మధ్య కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసింది. సెట్స్ నుంచి విడుదలైన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వింటర్ అవుట్ ఫిట్స్ లో దుల్కర్ ఆకట్టుకున్నారు, పూజా హెగ్డే కూడా తన అందమైన ప్రెజెన్స్‌తో ప్రత్యేకంగా కనిపించారు.
ఈ ఫోటోలు షూటింగ్ సమయంలోని రియల్ మూమెంట్స్ ని ప్రజెంట్ చేస్తున్నాయి. ఒక ఫోటోలో వర్షపు జల్లుల మధ్య గొడుగుల కింద దుల్కర్, పూజా కలిసి నవ్వులు పంచుకుంటూ కనిపిస్తే, మరో ఫోటోలో బ్యాక్‌ప్యాక్స్, తాడుపై వంతెన, పర్వత ప్రాంత ప్రార్థనా జెండాల మధ్య ట్రావెల్ మూవీ ఫీల్‌ను తీసుకొచ్చేలా ఉంది. మరో ఫోటోలో అడవుల మధ్య ఉన్న ఆలయం ముందు మొత్తం చిత్ర బృందం కలిసి కనిపించింది. దుల్కర్, పూజా కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. వారి మధ్య కనిపిస్తున్న సహజమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది,
ఈ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవి నెలకుడితి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
సహ నిర్మాత: గోపీచంద్ ఇన్నమూరి
సిఈవో: విజయ్ కుమార్ చాగంటి
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: అనయ్ ఓం గోస్వామి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- బస్సులో మరింత భద్రత కోసం TGSRTC కీలక నిర్ణయం
- ఈద్ అల్ అదా ముందు టపాసుల వినియోగంపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- చాట్GPT చూసి బాంబుల తయారీ!
- మరోసారి విజయ్ ప్రభుత్వం పై స్టాలిన్ కౌంటర్
- క్వెట్టా రైల్వే స్టేషన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
- మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!
- ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!
- అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో ఫౌంటెన్ తిరిగి ప్రారంభం..!!









