'ఇట్లు అర్జున' ఫస్ట్ సింగిల్ హాయ్ రే మే 28న రిలీజ్
- May 24, 2026
వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అనీష్, మహేష్ ఉప్పల 'ఇట్లు అర్జున' కోసం మెలోడీ మేజిక్ క్రియేట్ చేసిన ఎస్.థమన్, ఫస్ట్ సింగిల్ హాయ్ రే మే 28న రిలీజ్
స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. “న్యూ గై ఇన్ టౌన్” అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. అక్కినేని నాగార్జున ఇచ్చిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం విడుదలైన పోస్టర్లు, ‘ఫైండింగ్ అర్జున’ అనే స్పెషల్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజికల్ జర్నీని ప్రారంభించిన మేకర్స్, మే 28న విడుదల కానున్న తొలి సింగిల్‌కు ‘హాయ్ రే’ అనే టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
పోస్టర్‌లో అనీష్, అనస్వర రాజన్‌ల మధ్య కనిపిస్తున్న సహజమైన కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిటికీ పక్కన తన ఆలోచనల్లో మునిగిపోయిన అనస్వరను, బయట కూర్చొని మౌనంగా ప్రేమతో చూస్తున్న అనీష్ లుక్ ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇది ఒక సినిమా పోస్టర్ కంటే నిజ జీవితంలోని మధురమైన క్షణంలా అనిపిస్తూ ప్రేమను ఎంతో సహజంగా చూపిస్తోంది.
పోస్టర్ చూస్తుంటే ‘హాయ్ రే’ పాట తొలి ప్రేమలో కలిగే మధురమైన అనుభూతులను, సున్నితమైన భావోద్వేగాలను, హృద్యమైన రొమాంటిక్ మూడ్‌ను ఆవిష్కరించబోతున్నట్టు స్పష్టమౌతుంది. మెలోడీ ప్రేమికులను ఆకట్టుకునే ఈ పాట కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







