ఇదేం ప్రవర్తన.. గోళ్లు గిల్లుకుంటూ..నవ్వుతూ కనిపించిన పోలీస్ అధికారిని..
- May 25, 2026
కోయంబత్తూరు: కోయంబత్తూరులోని సూలూరులో పదేళ్ల బాలిక కనిపించకుండా పోయింది. ఆ తరువాత ఒక చెరువు సమీపంలో శవమై కనిపించింది.ఆ బాలిక దారుణ హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ తరుణంలో ఈ కేసుకు సంబంధించి పశ్చిమ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) ఆర్.వి.రమ్య భారతి, మరో ఇద్దరు పోలీస్ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సున్నితమైన కేసు గురించి మాట్లాడుతున్న సమయంలో వారు నవ్వడం, మహిళా పోలీస్ అధికారి గోళ్లు గిల్లుకుంటూ పెద్దగా నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు సదరు అధికారుల ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక మైనర్ బాలిక పై హత్యాచారం, మృతి కేసుకు సంబంధించిన విషయం గురించి వివరాలు చెబుతున్న సమయంలో కనీసం సానుభూతి లేకుండా.. పోలీసు అధికారులు ముగ్గురు నవ్వుకోవడంపై నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వీరి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, బాలిక హత్య ఘటనకు సంబంధించి తమిళనాడు మంత్రి ఎస్. కీర్తన స్పందించిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మంత్రి మాట్లాడుతున్న సమయంలో ఆమె నవ్వుతున్నట్లు కనిపించారని బీజేపీ విమర్శలు చేసింది.
అసలు కేసు విషయానికి వస్తే..
కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలిక అపహరణ, హత్య ఘటనపై తమిళనాడు పోలీసులు పశ్చిమ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) ఆర్.వి. రమ్య భారతి మాట్లాడుతూ.. ఈ కేసు విషయంలో సీసీటీవీ కెమెరాలు, సమీపంలోని ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా.. నాగపట్టణం జిల్లాకు చెందిన ప్రస్తుతం కోయంబత్తూరులో స్థిరపడిన సుమారు 33ఏళ్ల కార్తి అనే వ్యక్తి నిందితుడిగా గుర్తించడం జరిగిందని చెప్పారు.
బాధితురాలి కుటుంబానికి అతను పొరుగు వ్యక్తి, ఆ కుటుంబానికి పరిచయస్తుడు. తప్పిపోయిన బాలికను తనతో పాటు తీసుకువెళ్లినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో కన్నంపాలయంలోని మరియా రోజ్ గార్డెన్ అపార్ట్మెంట్స్లోని మొదటి అంతస్తులో నిందితుడు కార్తి దాక్కున్నాడని సమాచారం రావడంతో, ప్రత్యేక పోలీసు బృందం ఆ భవనాన్ని చుట్టుముట్టింది. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతను పైనుంచి దూకడంతో, అతని కుడి చేయి, కుడి కాలు విరిగాయి. ఆ తరువాత అతన్ని అరెస్టు చేయడం జరిగిందని ఆర్.వి. రమ్య భారతి చెప్పారు.
అరెస్టు అనంతరం విచారణ చేపట్టగా.. నిందితుడు కార్తి బాలికను ప్రలోభపెట్టి, లైంగికంగా వేధించి, ఆ తర్వాత హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తదుపరి దర్యాప్తులో మోహన్ అనే మరో నిందితుడి ప్రమేయంకూడా ఉందని తేలింది. 30 సంవత్సరాలు అతను ప్రధాన నిందితుడైన కార్తికి సహకరించాడని ఆరోపణలు ఉన్నాయి. అందుకే అతడిని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడైన కార్తిని తదుపరి చికిత్సకోసం కోయంబత్తూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. ఈ కేసు మైనర్ బాలికపై దాడికి సంబంధించినది కావడంతో, పోక్సో చట్టంలోని నిబంధనలను చేర్చడానికి కేసును సవరిస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్.వి రమ్య భారతి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







