ఒమన్‌లో 47.5 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత..!!
- May 29, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. పలు విలాయత్‌లలో అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలను నమోదు అవుతున్నాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీకి చెందిన వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన సమాచారం ప్రకారం, 24 గంటల వ్యవధిలో అల్ రుస్తాఖ్లో అత్యధికంగా 47.5°C ఉష్ణోగ్రత నమోదైంది.
ఇతర ప్రాంతాలలో కూడా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫాహుద్లో 47.2°C, దామా వా అల్ తాయీన్లో 47.0°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్ అమెరాత్ మరియు అస్ సునైనా రెండింటిలోనూ 46.9°C ఉష్ణోగ్రత నమోదు కాగా, బిద్బిద్ మరియు బిదియాలో 46.7°C నమోదైంది. తీవ్రమైన వేడిని ఎదుర్కొంటున్న ఇతర ప్రాంతాలలో అల్ ఖాబిల్ మరియు సమైల్‌లో 46.6°C, అలాగే అల్ అవబి మరియు సహమ్లలో 46.5°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వేసవి తీవ్రత అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తరచూ ద్రవాలను తీసుకొని హైడ్రెడ్ గా ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







