NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
- June 16, 2026
న్యూ ఢిల్లీ: నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలలో అక్రమాలు, తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
జూన్ 22 వరకు యాప్ సేవల నిలిపివేత
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ అందుబాటులో ఉండదని సమాచారం. ఈ ఆదేశాల తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను తొలగించగా, యాపిల్ యాప్ స్టోర్‌లో కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సుల ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత కాపాడేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొన్నారు.
మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ పై కూడా ఆంక్షలు
జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాత సందేశాలను సవరించి తప్పుడు ఆధారాలు సృష్టించే అవకాశాన్ని అడ్డుకోవడమే దీని ఉద్దేశమని అధికారులు తెలిపారు.
పేపర్ లీక్ ఆరోపణల పై చర్యలు
మే 2026లో జరిగిన నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి రావడంతో జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో టెలిగ్రామ్ ఛానెళ్లు, గ్రూపుల ద్వారా చీటింగ్ ముఠాలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఎన్టీఏ గుర్తించింది. కొన్ని ఛానెళ్లను తొలగించినప్పటికీ సమస్య కొనసాగడంతో, టెలిగ్రామ్‌పై దేశవ్యాప్త తాత్కాలిక నిషేధం విధించాలని ఎన్టీఏ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు









