హైదరాబాద్ లో గన్ తో కానిస్టేబుల్ హాల్ చల్
- June 18, 2026
హైదరాబాద్: హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న గన్ తో బెదిరించిన కానిస్టేబుల్ వ్యవహారం సంచలనం రేపింది. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ ప్రాంతానికి ఇతడు వెళ్లాడు. అక్కడ ఉన్న మెమోస్ డిలైట్ ఫుడ్ కోర్టుకు వెళ్లి ఆహారం తీసుకున్నాడు. బిల్లు చెల్లించే సమయంలో జరిగిన గొడవ తీవ్రరూపం దాల్చింది.
డబ్బుల కోసం గన్ తో బెదిరింపు
తిన్న ఆహారానికి నూట డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాలని యాజమాన్యం కోరింది. ఆ ధర ఎక్కువని భావించిన కానిస్టేబుల్ వివేక్ వాదనకు దిగాడు. తాను పోలీసు అధికారిని అని చెబుతూ డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని గన్ తీసి హడలెత్తించాడు. వెంటనే స్పందించిన ఫుడ్ కోర్టు నిర్వాహకుడు వందకు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పెట్రోల్ మొబైల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు
సదరు కానిస్టేబుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఫుడ్ కోర్టులో గొడవ జరిగిన మాట వాస్తవమేనని విచారణలో తేలింది. ఐడి కార్డు లేకపోవడంతో పాటు డబ్బుల విషయంలో గొడవ జరగడం వల్లే గన్ తో బెదిరించాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







