వేధింపులు భరించలేక షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య
- June 18, 2026
హైదరాబాద్: హీరోయిన్‌గా గుర్తింపు పొందాలనే ఆశయంతో నగరానికి వచ్చిన యువ నటి అమూల్య శ్రీ, కొందరు వ్యక్తుల వేధింపులు మరియు బ్లాక్‌మెయిల్‌ను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అమూల్య శ్రీ మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సమాచారం ప్రకారం, అమూల్య శ్రీ కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా బాత్రూం వీడియోలను చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం తమ కోరికలు తీర్చాలని, లేనిపక్షంలో ఆ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తామని బెదిరిస్తూ గత ఆరు నెలలుగా ఆమెను బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.
నిందితుల నిరంతర వేధింపులు, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక చివరకు అమూల్య శ్రీ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
అమూల్య శ్రీ మృతితో ఆమె తల్లి కన్నీరుమున్నీరవుతూ, ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఘటన జరిగి దాదాపు పది రోజులు గడిచినా ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నలుగురు యువకులతో పాటు ఒక యువతి కూడా ప్రమేయం ఉన్నట్లు సమాచారం.
ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుండగా, పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







