ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాల పై చర్చించిన ఒమన్, జర్మనీ..!!
- June 19, 2026
మస్కట్: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ, జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్‌తో టెలిఫోన్ ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మరియు ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఒమన్ మరియు జర్మనీల మధ్య వివిధ రంగాలలో ఉన్న సహకారాన్ని, స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడానికి తమ అసక్తిని వ్యక్తపరిచారు. వీటితోపాటు తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలను కూడా సమీక్షించారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయడాన్ని స్వాగతించారు. ఈ అవగాహన ఒప్పందం విజయవంతంగా అమలు కావడానికి జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతు తెలిపారు. హోర్ముజ్ జలసంధి గుండా సముద్రయాన స్వేచ్ఛ, భద్రతను కాపాడుతూ.. ప్రాంతీయ భద్రత, శాంతిని పెంపొందించే అంశాలకు తమ మద్దుతు ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..







