మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- June 30, 2026
దోహా: ఖతార్ రియల్ ఎస్టేట్ రంగం మే నెలలో మెరుగైన రికార్డు స్థాయిలో లావాదేవీలు నమోదు చేసింది. మొత్తం 425 ఒప్పందాల ద్వారా QR1.732 బిలియన్ల విలువైన డీల్స్ జరిగాయి. ఇక లావాదేవీల విలువ పరంగా దోహా అగ్రస్థానంలో కొనసాగగా, అమ్మిన ఆస్తుల సంఖ్య మరియు మొత్తం విస్తీర్ణం పరంగా ఆల్ రయ్యాన్ అత్యంత యాక్టివ్ మార్కెట్‌గా నిలిచింది.
న్యాయ మంత్రిత్వ శాఖలోని రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ విభాగం విడుదల చేసిన తాజా రియల్ ఎస్టేట్ మార్కెట్ సూచిక ప్రకారం, మే నెలలో దోహా మునిసిపాలిటీ అత్యధికంగా QR559.019 మిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలను నమోదు చేసింది. ఆల్ రయ్యాన్ QR538.610 మిలియన్ల విలువైన ఆస్తి ఒప్పందాలతో తర్వాతి స్థానంలో నిలవగా, ఆల్ దాయెన్ QR368.365 మిలియన్ల విలువైన లావాదేవీలతో మూడవ స్థానంలో నిలిచింది.
అమ్మకాల కార్యకలాపాల పరంగా, మే నెలలో అమ్ముడైన మొత్తం ఆస్తుల సంఖ్యలో 33 శాతాన్ని నమోదు చేయడం ద్వారా ఆల్ రయ్యాన్ అన్ని మునిసిపాలిటీలలోనూ అగ్రస్థానంలో నిలిచింది. దోహా 26 శాతం లావాదేవీలతో రెండవ స్థానంలో ఉండగా, ఆల్ దాయెన్ 16 శాతం వాటాను కలిగి ఉంది.
దోహాలో సగటు ధర చదరపు అడుగుకు QR831కి చేరుకుంది. అల్ దాయెన్ చదరపు అడుగుకు QR714తో రెండవ స్థానంలో ఉంది. అల్ వక్రాలో చదరపు అడుగుకు సగటున 516 క్యూఆర్లు నమోదు కాగా, ఉమ్ స్లాల్‌లో 469 క్యూఆర్ గా నమోదైంది.
తాజా వార్తలు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్‌పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్‌చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు







