తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- June 30, 2026
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్ర రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుడుతూ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక పై రాష్ట్ర రవాణా శాఖ కొనుగోలు చేసే కొత్త బస్సులన్నీ కేవలం ఎయిర్ కండిషన్డ్ (AC) బస్సులు మాత్రమే అయి ఉండాలని ఆయన రవాణా శాఖను ఆదేశించారు.ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తమిళనాడు రవాణా శాఖ మంత్రి విజయ్ పార్తీబన్ అధికారికంగా వెల్లడించారు. సామాన్య ప్రజలకు కూడా అత్యుత్తమ, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ ముందడుగు వేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థను కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఆధునీకరించే దిశగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మారుమూల గ్రామాలకు అనుసంధానం..ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణం!
ప్రజా రవాణా వ్యవస్థను కేవలం నగరాలకే పరిమితం చేయకుండా, రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి విస్తరించాలని ముఖ్యమంత్రి విజయ్ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. “ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ సౌకర్యం లభించాలి. ఆఖరి మైలు వరకు బస్సు నెట్వర్క్ అనుసంధానం కావాలి. ఆ బస్సులు సామాన్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ హాయిగా ప్రయాణించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి” అని సీఎం ఆదేశించినట్లు మంత్రి విజయ్ పార్తీబన్ వివరించారు. ఎండ తీవ్రత, కాలుష్యం నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తూ, తక్కువ ధరలోనే ఏసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలు సొంత వాహనాలను పక్కనబెట్టి ప్రభుత్వ రవాణాను ఆశ్రయిస్తారని, తద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!







