రాజశేఖర్ కు జోడిగా పూజ కుమార్..
- August 11, 2016
విశ్వరూపం, ఉత్తమ విలన్ లాంటి చిత్రాల్లో లోకనాయకుడు కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా నటించిన ఓ హాట్ బ్యూటి తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకరించింది. అది కూడా చాలా రోజులుగా సరైన సక్సెస్ లేక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ సరసన. లాంగ్ గ్యాప్ తరువాత గడ్డం గ్యాంగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రాజశేఖర్ మరోసారి నిరాశపరిచాడు.దీంతో ఇక హీరో వేశాలు పక్కన పెట్టి నెగెటివ్ రోల్స్ కు కూడా రెడీ అంటూ ప్రకటించేశాడు. అయితే ఒకటి రెండు సినిమాలో విలన్ వేశాలు వచ్చినట్టుగా వార్తలు వినిపించినా అవేవి సెట్స్ మీదకు రాలేదు. అయితే చందమామ కథలు, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తార్ రాజశేఖర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రాజశేఖర్ ను యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా చూపించనున్నట్టుగా ప్రకటించాడు డైరెక్టర్. అంతేకాదు ఈ సినిమాలో రాజశేఖర్ కు జోడిగా పూజ కుమార్ ను ఫైనల్ చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ స్క్రీన్ మీద కొత్త కనిపిస్తుందని.. ఆ లుక్ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తార్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







