'సిగ్మా' డబ్బింగ్ పూర్తి
- July 01, 2026
లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న 'సిగ్మా' సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 31న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం. తమిళ్ కుమరన్ మాట్లాడుతూ... "సిగ్మా ఇప్పుడు ఫైనల్ షేప్ తీసుకుంటుండటం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. జేసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేయడం మా కోసం ఎంతో ప్రత్యేకమైన అనుభవం. ఇది ఆయన తొలి చిత్రం అయినప్పటికీ, ప్రతి దశలో ఆయన చూపించిన స్పష్టత, నమ్మకం, క్రమశిక్షణ, అనుభవజ్ఞుడైన దర్శకుడిని తలపించాయి. సందీప్ కిషన్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృందం అందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు 'సిగ్మా'ను తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం."
దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ... "డబ్బింగ్ పూర్తి కావడం మా ప్రయాణంలో ఎంతో సంతృప్తినిచ్చే మైలురాయి. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు 'సిగ్మా'ను తీసుకురావడానికి మరో అడుగు దగ్గరయ్యాం. నా విజన్‌ను నమ్మి, పూర్తి సృజనాత్మక స్వేచ్ఛ ఇచ్చిన మా నిర్మాత సుభాస్కరన్ సర్, జి.కె.ఎం. తమిళ్ కుమరన్ సర్, లైకా ప్రొడక్షన్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి ప్రోత్సాహం వల్లనే నేను అనుకున్న విధంగా ఈ సినిమాను తెరకెక్కించగలిగాను. సందీప్ కిషన్, నటీనటులు, సాంకేతిక బృందం, యూనిట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మా పూర్తి దృష్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే ఉంది. అవి శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు 'సిగ్మా'ను తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం."
భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న 'సిగ్మా'లో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా, రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్, హరిహరసుధన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్‌గా పనిచేస్తున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి థియేట్రికల్ అనుభూతిని అందించేలా తీర్చిదిద్దుతున్నారు. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్‌తో పాటు మిగతా ప్రమోషనల్ అప్‌డేట్స్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. జూలై 31న 'సిగ్మా' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్‌ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్‌ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







